Share News

MLA Vasantha: బాబు ఇంటి జోలికొస్తే నీ ఇల్లు భూస్థాపితం చేస్తాం: ఎమ్మెల్యే వసంత

ABN , Publish Date - Jun 17 , 2025 | 05:23 AM

జోగి రమేశ్‌... నోరు అదుపులో పెట్టుకో. నీకు కానీ, నీ నాయకులకు కానీ దమ్ముంటే మరోమారు చంద్రబాబు ఇంటిపైకి వెళ్లు. నీ ఇల్లు భూస్థాపితం చేసి తీరుతాం అని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ హెచ్చరించారు.

MLA Vasantha: బాబు ఇంటి జోలికొస్తే నీ ఇల్లు భూస్థాపితం చేస్తాం: ఎమ్మెల్యే వసంత

‘జోగి రమేశ్‌... నోరు అదుపులో పెట్టుకో. నీకు కానీ, నీ నాయకులకు కానీ దమ్ముంటే మరోమారు చంద్రబాబు ఇంటిపైకి వెళ్లు. నీ ఇల్లు భూస్థాపితం చేసి తీరుతాం’ అని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ హెచ్చరించారు. కొండపల్లి మున్సిపాలిటీలో టీడీపీ విజయం అనంతరం సోమవారం ఆయన మాట్లాడారు. ‘ఎవరిపైకి తగవులకు వెళ్లొద్దని, దురుసుగా ప్రవర్తించవద్దని, తప్పుడు పోస్టులు పెట్టొద్దని చంద్రబాబు చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాం. కొండపల్లి మున్సిపాలిటీలో మాకు సంపూర్ణ బలం ఉంది. అధికారులు అనివార్య కారణాలతో ఒకసారి వాయిదా వేస్తే మేం పారిపోయినట్లు ఎలా అవుతుంది? ఈరోజు మీరు పారిపోయారు. కోర్టు తీర్పునకు మేం కట్టుబడి ఉన్నాం. రాష్ట్రంలో ఘోరంగా ఓడిన నువ్వెక్కడ... మైలవరం చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన నేనెక్కడ..! రోడ్డున నాలాంటి ఏనుగులు వెళ్తుంటే నీలాంటి కుక్కలు మొరుగుతాయ్‌. వాటికి సమాధానం చెప్పాల్సిన పని లేదు’ అని వసంత పేర్కొన్నారు.

Updated Date - Jun 17 , 2025 | 05:23 AM