Mithun Reddy: జైల్లో మిథున్‌రెడ్డికి వైద్యపరీక్షలు
ABN , Publish Date - Jul 30 , 2025 | 05:14 AM
లిక్కర్ స్కాం కేసులో రిమాండ్‌పై రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి మంగళవారం రాజమహేంద్రవరం జీజీహెచ్ వైద్యులు
2డీ ఎకో మెషీన్‌ను వెంట తీసుకెళ్లిన వైద్యులు!
వివరాలు చెప్పలేమని వెల్లడి
రాజమహేంద్రవరం అర్బన్, జూలై 29 (ఆంధ్రజ్యోతి): లిక్కర్ స్కాం కేసులో రిమాండ్‌పై రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి మంగళవారం రాజమహేంద్రవరం జీజీహెచ్ వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహించారు. మధ్యాహ్న సమయంలో సెంట్రల్ జైలు అధికారుల పిలుపుతో ఆర్‌ఎంవో డాక్టర్ సుబ్బారావు ఆధ్వర్యంలో ముగ్గురు వైద్యులతో కూడిన జనరల్ ఫిజీషియన్ల బృందం మిథున్‌రెడ్డి వద్దకు వెళ్లింది. వీరి వెంట జీజీహెచ్ అంబులెన్సులో గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించే 2డీ ఎకో మెషీన్, సంబంధిత టెక్నీషియన్, ఇతర సహాయకులు వెళ్లారు. అయితే జైలు అధికారులు ప్రభుత్వ వైద్యులతోపాటు 2డీ ఎకో టెక్నీషియన్ ఒక్కరిని మాత్రమే మిథున్‌రెడ్డి ఉన్న బ్యారక్‌లోకి అనుమతించినట్లు సమాచారం. మధ్యాహ్నం 12 గంటల సమయంలో జైలు అధికారి ఒకరు జీజీహెచ్‌కు వచ్చి సూపరింటెండెంట్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. జైలు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మిథున్‌రెడ్డికి వైద్యపరీక్షల కోసం వైద్యుల బృందాన్ని పంపాలని ఆయన కోరినట్లు తెలిసింది. 2డీ ఎకో మెషీన్‌ను ఎందుకు తీసుకెళ్లారని జీజీహెచ్ వైద్యాధికారులను అడుగగా.. ఎలాంటి వైద్యపరీక్షలు నిర్వహించామో చెప్పలేమని, రహస్యంగా ఉంచాల్సిన విషయమని బదులిచ్చారు.