CM Chandrababu Naidu: జిల్లాల్లో జెండా పండుగ అతిథులు వీరే
ABN , Publish Date - Aug 05 , 2025 | 06:01 AM
దేశ స్వాతంత్య్ర దినోత్సవం రోజున రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో జరిగే వేడుకల్లో జాతీయ జెండాలను ఎగుర వేసి సందేశాలను
మంత్రుల జాబితా విడుదల చేసిన ప్రభుత్వం
గుంటూరు, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): దేశ స్వాతంత్య్ర దినోత్సవం రోజున రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో జరిగే వేడుకల్లో జాతీయ జెండాలను ఎగుర వేసి సందేశాలను ఇచ్చే మంత్రుల జాబితాని ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. విజయవాడలోని మునిసిపల్ స్టేడియంలో జరిగే రాష్ట్ర వేడుకలో సీఎం చంద్రబాబు త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడలో, మంత్రులు నారా లోకేశ్(గుంటూరు), కింజరాపు అచ్చెన్నాయుడు(శ్రీకాకుళం), కొల్లు రవీంద్ర(కృష్ణ), నాదెండ్ల మనోహర్(పల్నాడు), పొంగూరు నారాయణ(ఎ్‌సపీఎ్‌సఆర్ నెల్లూరు), వంగలపూడి అనిత(అనకాపల్లి), సత్యకుమార్ యాదవ్(చిత్తూరు), నిమ్మల రామానాయుడు(పశ్చిమ గోదావరి), ఎన్‌ఎండీ ఫరూక్(వైఎ్‌సఆర్ కడప), ఆనం రామనారాయణరెడ్డి(తిరుపతి), పయ్యావుల కేశవ్(అనంతపురం), అనగాని సత్యప్రసాదు(విశాఖపట్టణం), కొలుసు పార్థసారథి(ఏలూరు), బాల వీరాంజనేయ స్వామి(ప్రకాశం), గొట్టిపాటి రవికుమార్(బాపట్ల), కందుల దుర్గేశ్(తూర్పు గోదావరి), గుమ్మడి సంధ్యారాణి(పార్వతీపురం మన్యం), బీసీ జనార్దన్‌రెడ్డి(నంద్యాల), టీజీ భరత్(కర్నూలు), ఎస్.సవిత(శ్రీ సత్యసాయి), వాసంశెట్టి సుభాశ్(కోనసీమ), కొండపల్లి శ్రీనివా్‌స(విజయనగరం), ఎం రాంప్రసాద్‌రెడ్డి(అన్నమయ్య) పాల్గొంటారు. అల్లూరి జిల్లాకు అక్కడి కలెక్టర్‌కే బాధ్యతలు కేటాయించింది. ఈ విషయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ(పొలిటికల్) ముఖేశ్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులను పంపించారు.