Share News

Minister Satya Kumar: సంకల్పబలంతోనే యోగాంధ్ర విజయం మంత్రి సత్యకుమార్‌

ABN , Publish Date - Jun 22 , 2025 | 04:40 AM

సంకల్పబలం, ప్రణాళికా సామర్థ్యం, పర్యవేక్షణా పటిమ ఉంటే ఏదైన సాధించవచ్చన్న విషయం విశాఖ వేదికగా జరిగిన యోగాంధ్ర ద్వారా నిరూపితం అయిందని మంత్రి సత్యకుమార్‌ హార్షం వ్యక్తం చేశారు.

Minister Satya Kumar: సంకల్పబలంతోనే యోగాంధ్ర  విజయం మంత్రి సత్యకుమార్‌

అమరావతి, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): సంకల్పబలం, ప్రణాళికా సామర్థ్యం, పర్యవేక్షణా పటిమ ఉంటే ఏదైన సాధించవచ్చన్న విషయం విశాఖ వేదికగా జరిగిన యోగాంధ్ర ద్వారా నిరూపితం అయిందని మంత్రి సత్యకుమార్‌ హార్షం వ్యక్తం చేశారు. యోగాంధ్ర ఘన విజయంపై ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు. పాలకులు సదుద్దేశంతో తీసుకునే నిర్ణయలకు ప్రజలు మద్దతిస్తారని నెల రోజుల పాటు సాగిన యోగాంధ్ర నిర్ధారించిందన్నారు. జూన్‌ 21న ఆంధ్రప్రదేశ్‌ విశిష్టత దేశ విదేశాలకు తెలిసిందన్నారు. యోగాడే ఘన విజయానికి కర్త, కర్మ,క్రియ అయిన సీఎం చంద్రబాబుకు మంత్రి శుభాభినందనలు తెలిపారు.


పారదర్శకంగా బదిలీలు: ఉద్యోగుల సంఘం

ఆరోగ్యశాఖలో బదిలీల ప్రక్రియ జవాబుదారీ, పారదర్శకంగా జరగడానికి మంత్రి సత్యకుమార్‌ ప్రత్యేక దృష్టి కారణమని, ఆయన ఉన్నతాధికారులకు సృష్టమైన ఆదేశాలు ఇవ్వడం వల్లనే సాధ్యమైందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అభిప్రాయం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో అతి పెద్ద శాఖగా, వివిధ కేటగిరిల ఉద్యోగులు ఎక్కువగా ఉన్న ఆరోగ్యశాఖలో జరిగిన బదిలీల పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది.

Updated Date - Jun 22 , 2025 | 04:40 AM