BC Corporations Loan : బీసీ రుణాల దరఖాస్తు గడువు పెంపు
ABN , Publish Date - Feb 07 , 2025 | 05:31 AM
ప్రభుత్వం అందిస్తున్న బీసీ కార్పొరేషన్ల రుణాలను అర్హులందరికీ అందజేయాలని, దరఖాస్తు గడువు ఈ నెల 12వరకు పెంచామని మంత్రి ఎస్ సవిత చెప్పారు. రుణాల సద్వినియోగంపై

అమరావతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అందిస్తున్న బీసీ కార్పొరేషన్ల రుణాలను అర్హులందరికీ అందజేయాలని, దరఖాస్తు గడువు ఈ నెల 12వరకు పెంచామని మంత్రి ఎస్ సవిత చెప్పారు. రుణాల సద్వినియోగంపై విజయవాడ బీసీ భవన్‌లో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లతో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ గడువు పెంపు సమాచారాన్ని జిల్లాలకు అందించాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో అర్హులకు మాత్రమే ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు.