తప్పుడు మెయిల్స్ పెట్టిన వారిపై కేసులు: పయ్యావుల
ABN , Publish Date - Jul 26 , 2025 | 04:06 AM
పూర్వకాలంలో దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు దానిని చెడగొట్టడానికి ప్రయత్నాలు చేసేవారు. రాష్ట్రంలో వైసీపీ నేతల తీరు కూడా ఇలానే ఉంది.
బాపట్ల, జూలై 25(ఆంధ్రజ్యోతి): ‘పూర్వకాలంలో దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు దానిని చెడగొట్టడానికి ప్రయత్నాలు చేసేవారు. రాష్ట్రంలో వైసీపీ నేతల తీరు కూడా ఇలానే ఉంది. ప్రభుత్వానికి అప్పులు ఇవ్వొద్దని ఆ పార్టీ నేతలు దుర్మార్గంగా బ్యాంకులకు 200 ఈ మెయిల్స్ పెట్టారు. అన్నం తినేవాడు ఎవడయినా ఇలాంటి పనిచేస్తాడా? అక్కడ అప్పు పుట్టకుండా చేసి ఇక్కడ పొగాకు కొనడం లేదని దొంగ ఏడుపులు ఏడుస్తారు. రాష్ట్ర పరపతిని దెబ్బతీసే విధంగా ఈ మెయిల్స్ పెట్టిన వారిపై కేసులు పెడతాం’ అని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. బాపట్ల జిల్లా పర్చూరులో శుక్రవారం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పయ్యావుల పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News