Share News

10న కర్నూలుకు మంత్రి నారా లోకేశ

ABN , Publish Date - Jan 07 , 2025 | 11:41 PM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ 10వ తేదీ శుక్రవారం కర్నూలుకు రానున్నారు.

   10న కర్నూలుకు మంత్రి నారా లోకేశ

కర్నూలు, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ 10వ తేదీ శుక్రవారం కర్నూలుకు రానున్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత, టీజీ శిల్పా దంపతుల కుమార్తె టీజీ శ్రీఆర్యపాన్య, ప్రముఖ వ్యాపారవేత్త బొమ్మిడాల రాజా, రమాదేవి దంపతుల కుమారుడు బొమ్మిడాల వెంకటశ్రీ నలినల వివాహం డిసెంబరు 26న హైదరాబాద్‌లోని జరిగిన విషయం తెలిసిందే. ఈ నెల 10వ తేది శుక్రవారం స్థానిక ఎస్‌ఏపీ క్యాంప్‌లో ఉదయం 11 గంటలకు రిసెప్షన నిర్వహించనున్నారు. ఈ ఫంక్షనకు ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేశ హాజరు కానున్నారు. ముందు రోజు 9వ తేదీ గురువారం అనంతపురం జిల్లా పర్యటనను ముగించుకొని రాత్రి 11 గంటలకు కర్నూలు నగరంలోని స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి 10వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రభుత్వ కళాశాలలను పరిశీలిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఎస్‌ఏపీ క్యాంప్‌ మైదానం చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం 1:30 గంటలకు కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

Updated Date - Jan 07 , 2025 | 11:41 PM