Kadapa: కాశినాయన క్షేత్రంలో నిర్మాణ పనులకు శ్రీకారం
ABN , Publish Date - Mar 14 , 2025 | 04:26 AM
వైఎస్సార్ కడప జిల్లా కాశినాయన మండలంలోని అవధూత కాశినాయన జ్యోతి క్షేత్రంలో కూల్చేసిన నిర్మాణాలను తిరిగి చేపడతామని మంత్రి లోకేశ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.

హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్
కడప, మార్చి 13(ఆంధ్రజ్యోతి): వైఎస్సార్ కడప జిల్లా కాశినాయన మండలంలోని అవధూత కాశినాయన జ్యోతి క్షేత్రంలో కూల్చేసిన నిర్మాణాలను తిరిగి చేపడతామని మంత్రి లోకేశ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఈ మేరకు అక్కడ అన్నదాన సత్రం నిర్మాణానికి గురువారం మార్కింగ్ చేశారు. కాశినాయన జ్యోతి క్షేత్రంలో అటవీ శాఖ అనుమతులు లేవంటూ అక్కడ కట్టిన నిర్మాణాలను ఇటీవల అధికారులు కూల్చేశారు. కూల్చివేతలపై ప్రభుత్వం తరఫున లోకేశ్ క్షమాపణ చెప్పారు. ఇప్పుడు సత్రం నిర్మాణానికి మార్కింగ్ వేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.