Share News

Nara Lokesh: ప్రచారానికే మేనమామ.. వాస్తవానికి కంసమామ!

ABN , Publish Date - Jan 30 , 2025 | 05:10 AM

జగన్‌ ప్రచారానికే మేనమామ.. వాస్తవానికి కంసమామ అనే సంగతి స్పష్టమైందని విమర్శించారు. జగన్‌ పబ్లిసిటీ కోసం రూ.వందల కోట్లు ఖర్చు చేయడం తప్ప.. విద్యా ప్రమాణాలు పెం చేందుకు కనీస చర్యలు తీసుకోలేదని తాజా నివేదిక రుజువు చేసిందన్నా రు.

Nara Lokesh: ప్రచారానికే మేనమామ.. వాస్తవానికి కంసమామ!

జగన్‌ పాలనలో ప్రభుత్వ విద్యావ్యవస్థ విధ్వంసం

‘అసర్‌’ నివేదికతో మరోసారి తేటతెల్లం: లోకేశ్‌

అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): జగన్‌రెడ్డి పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ విధ్వంసానికి గురైందనే విషయం జాతీయ సర్వే సంస్థ అసర్‌ నివేదికతో మరోసారి తేటతెల్లమైందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. జగన్‌ ప్రచారానికే మేనమామ.. వాస్తవానికి కంసమామ అనే సంగతి స్పష్టమైందని విమర్శించారు. జగన్‌ పబ్లిసిటీ కోసం రూ.వందల కోట్లు ఖర్చు చేయడం తప్ప.. విద్యా ప్రమాణాలు పెం చేందుకు కనీస చర్యలు తీసుకోలేదని తాజా నివేదిక రుజువు చేసిందన్నా రు. 2018లో నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో మెరుగ్గా ఉన్న విద్యా ప్రమాణాలు వైసీపీ పాలనలో ఎలా దిగజారాయో అసర్‌ నివేదిక స్పష్టంగా వెల్లడించిందని బుధవారం ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. అక్షరాలు, అంకెలు గుర్తు పట్టలేని స్థితికి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను దిగజార్చడం, తగ్గిన హాజరు శాతం, పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం..

ఇలా అనేక అంశాలు గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతున్నాయని విమర్శించారు. ఎనిమిదో తరగతి విద్యార్థుల్లో దాదాపు సగం మంది రెండో తరగతి పుస్తకాలు సరిగా చదవలేని దుస్థితికి తీసుకువచ్చారంటూ మంత్రి లోకేశ్‌ మండిపడ్డారు. విధ్వంసానికి గురైన విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు గత ఏడు నెలలుగా అనేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. అనేక మార్పులకు నాంది పలికామని వివరించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో పక్కాగా లెక్కలు తీయడం దగ్గర మొదలు పెట్టి మారుతున్న కాలానికి తగ్గట్టుగా పాఠ్య ప్రణాళిక సిద్ధం చేయడంపై దృష్టి పెట్టి పని చేస్తున్నామన్నారు. త్వరలోనే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ప్రజలు, విద్యావేత్తల అభిప్రాయాలు తెలుసుకుని ‘ఏపీ మోడల్‌ ఆఫ్‌ స్కూల్‌ఎడ్యుకేషన్‌’ను రూపొందించనున్నట్లు లోకేశ్‌ తెలిపారు.


మరిన్నీ తెలుగు వార్తల కోసం..

Also Read: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర మంత్రులు.. అసలు విషయం ఇదే

Also Read: పంచగ్రామాల ప్రజలకు గుడ్ న్యూస్

Also Read: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టను రట్టు చేసిన పోలీసులు

Also Read: మీకు వాట్సాప్ ఉంటే చాలు.. మీ ఫోన్‌లోనే ప్రభుత్వం

Also Read: జాతీయ క్రీడల జరుగుతోన్న వేళ.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

Also Read: హైకోర్టు తీర్పుపై స్పందించిన జ్యోతి సురేఖ

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 30 , 2025 | 05:10 AM