Share News

జూన్‌ నాటికి 3లక్షల గృహాలు పూర్తి: మంత్రి కొలుసు

ABN , Publish Date - Mar 13 , 2025 | 04:08 AM

ఈ ఏడాది జూన్‌ నాటికి రాష్ట్రంలో 3లక్షల గృహాల నిర్మాణం పూర్తి చేసి, ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు.

జూన్‌ నాటికి 3లక్షల గృహాలు పూర్తి: మంత్రి కొలుసు

అమరావతి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది జూన్‌ నాటికి రాష్ట్రంలో 3లక్షల గృహాల నిర్మాణం పూర్తి చేసి, ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ‘కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 1.25లక్షల గృహాలు పూర్తి చేయగా, 7.25లక్షల ఇళ్లను 2026 మార్చికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో 5లక్షల ఇళ్లను వచ్చే జూన్‌లోగా పూర్తి చేస్తాం. మిగిలినవి వచ్చే ఏడాది మార్చికి పూర్తి చేస్తాం’ అని తెలిపారు. 5,98,710 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణానికి అదనపు సాయం అందించేందుకు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. దీనివల్ల రూ.3,219.75కోట్ల భారం పడుతుందని మంత్రి వివరించారు.

Updated Date - Mar 13 , 2025 | 04:08 AM