Kolusu Parthasarathi: జగన్ మూర్ఖత్వం, విలాసాలతో రాష్ట్రం ధ్వంసం
ABN , Publish Date - Jan 30 , 2025 | 05:01 AM
తాను చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోకుండా వైసీపీ ఎదురు దాడి చేస్తోంది’ అని మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. బుధవారం అమరావతి సచివాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికతో జగన్ సిగ్గుపడాలి.

పాపాలను ప్రక్షాళన చేసుకోకుండా ఎదురు దాడా?: పార్థసారథి
అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): ‘జగన్ మూర్ఖత్వం, విలాసాలతో రాష్ట్రం ధ్వంసమయింది. దీనిపై బహిరంగ చర్చకు మేం సిద్ధం. తాను చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోకుండా వైసీపీ ఎదురు దాడి చేస్తోంది’ అని మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. బుధవారం అమరావతి సచివాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికతో జగన్ సిగ్గుపడాలి. జగన్ తన సొంత పత్రికలో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. రూ.10 లక్షల కోట్ల అప్పులు, రూ.71 వేల కోట్ల వడ్డీలు రాష్ట్రంపై భారం వేసిన ఘనత జగన్‌రెడ్డిదే. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో జగన్ ఏం సాధించారు? మా ప్రభుత్వం ఏం సాధించింది? అన్న దానిపై చర్చకు సిద్ధం. వందల సార్లు ఢిల్లీ వెళ్లిన జగన్ రాష్ట్రానికి ఏం సాధించారు? కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌కు నిధులు, బీపీసీఎల్ రిఫైనరీ, ఎన్టీపీసీ లాంటి భారీ పెట్టుబడులు సాధించింది. ఏడు నెలల కాలంలో రూ.6.33 లక్షల కోట్లు విలువ చేసే ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది. ఇప్పటి వరకూ 4.1 లక్షల మందికి ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకున్నాం. ఇవేమీ అక్కర్లేదని జగన్ చెప్పగలరా?. జగన్ పాల్పడిన విధ్వంసంతో చితికిపోయిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెబితే దానిని వైసీపీ వక్రీకరించి బురద జల్లుతోంది’ అని మంత్రి అన్నారు.
మరిన్నీ తెలుగు వార్తల కోసం..
Also Read: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర మంత్రులు.. అసలు విషయం ఇదే
Also Read: పంచగ్రామాల ప్రజలకు గుడ్ న్యూస్
Also Read: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టను రట్టు చేసిన పోలీసులు
Also Read: మీకు వాట్సాప్ ఉంటే చాలు.. మీ ఫోన్‌లోనే ప్రభుత్వం
Also Read: జాతీయ క్రీడల జరుగుతోన్న వేళ.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు
Also Read: హైకోర్టు తీర్పుపై స్పందించిన జ్యోతి సురేఖ
For AndhraPradesh News And Telugu News