ప్రతి ఎకరాకు నీరందిస్తాం..
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:33 AM
గత 30 ఏళ్లుగా ఉన్న దీర్ఘకాలిక సమస్యలను త్వరలో పరిష్కరించి ప్రతి ఒక్క రైతుకు సాగు నీరు అందించడమే లక్ష్యమని, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ అన్నా రు.

మంత్రి కొలుసు, ఎంపీ పుట్టా
ముసునూరు, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): గత 30 ఏళ్లుగా ఉన్న దీర్ఘకాలిక సమస్యలను త్వరలో పరిష్కరించి ప్రతి ఒక్క రైతుకు సాగు నీరు అందించడమే లక్ష్యమని, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ అన్నా రు. కాట్రేనిపాడు సమీపంలో అసంపూర్తిగా ఉన్న వేంపాడు – మడిచర్ల సాగర్ కాల్వను ఆదివారం పరిశీలించారు. ఎన్‌ఎస్‌పీ ఈఈ ఆర్.సంతోష్, డీఈ వెంకటేశ్వరరావులతో మాట్లాడి కాల్వ వివరాలను తెలుసుకుని, రికా ర్డులు పరిశీలించారు. కాల్వ సమస్యను సాధ్య మైనంత త్వరలో పరిష్కరించి రైతులకు సాగు నీరు అందించేలా చర్యలు తీసుకుంటామ న్నా రు. సాగర్ కాల్వల మరమ్మతులను గత వైసీ పీ ప్రభుత్వం విస్మరించడంతో ముళ్ళపొద లు, తుప్పలు పెరిగినీటి ప్రవాహానికి ఆటంకంగా మారిందని మంత్రి పార్థ సారథి ఆరోపించారు. నిధులు మంజూరు చేయించి వేంపాడు మేజర్ కాల్వతో పాటు మైనర్ కాల్వల్లో ఉన్న జంగిల్‌ను తొలగించి చివరి భూములకు సైతం సాగర్‌జలాలను అందిస్తామన్నారు. ఎం పీ మాట్లాడుతూ చింతలపూడి ఎత్తి పోతల పథకం నిర్మాణం విషయంలో గత వైసీపీ ప్రభుత్వం వహించిన నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం నీటికోసం రైతులు అవస్థలు పడాల్సి న దుస్థితి నెలకొందన్నారు. ఈ పథకం పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. డీసీ చైర్మన్ రాపర్ల బాలకృష్ణ, ఎన్‌ఎస్‌పీ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కోటా వీర బాబు, ఏఈ సతీష్, నాయకులు, రైతులు పాల్గొన్నారు.