Kollu Ravindra: జగన్ ఫ్యాక్షనిజానికి ఎన్నికల్లో స్వస్తి పలికాం
ABN , Publish Date - Aug 14 , 2025 | 05:03 AM
జగన్‌రెడ్డి ఫ్యాక్షనిజానికి స్వస్తిపలికి పులివెందులలో ప్రజాస్వామ్యయుతంగా ఉపఎన్నికలు నిర్వహించామని ..
మచిలీపట్నం టౌన్, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): జగన్‌రెడ్డి ఫ్యాక్షనిజానికి స్వస్తిపలికి పులివెందులలో ప్రజాస్వామ్యయుతంగా ఉపఎన్నికలు నిర్వహించామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. 30 ఏళ్ల తరువాత చాలా మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. దేశంలో అత్యున్నత ఎక్సైజ్ పాలసీ విధానాన్ని ఏపీలో అమలు చేశామన్నారు. వచ్చే నెల నుంచి కొత్త బార్ పాలసీ విధానాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. రోడ్డు మీద మద్యం తాగే విధానానికి స్వస్తి పలికేందుకు పర్మిట్ రూమ్‌లకు అనుమతులు ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు.