Share News

Minister Keshav Criticizes Jagan: రాజకీయ అశాంతికి ఆజ్యం పోశారు

ABN , Publish Date - Apr 10 , 2025 | 03:30 AM

ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆయన పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసి, శ్రీసత్యసాయి జిల్లాలో రాజకీయ అశాంతి సృష్టించారని చెప్పారు. రాజకీయ అస్తిత్వం కాపాడుకోవడానికే ఆయన ఈ చర్యలు చేస్తున్నారని మండిపడ్డారు

Minister Keshav Criticizes Jagan: రాజకీయ అశాంతికి ఆజ్యం పోశారు

బెళుగుప్ప, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకే జగన్మోహన్‌రెడ్డి పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా బెళుగుప్పలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రశాంతంగా ఉన్న శ్రీసత్యసాయి జిల్లాలో జగన్‌ పర్యటించి కులాలు, వర్గాల మధ్య చిచ్చుపెడుతున్నారని, అశాంతి రేపేందుకు, రాజకీయ కుట్రకు ఆజ్యం పోశారని మండిపడ్డారు. ఓ గ్రామంలో జరిగిన సంఘటనను రెడ్‌బుక్‌ రాజ్యాంగం అంటూ మాట్లాడటం దారుణమన్నారు. పోలీసు శాఖపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అమానుషమన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 03:30 AM