Share News

మద్యంలో కోట్లు కొల్లగొట్టారు: మంత్రి జనార్దన్‌

ABN , Publish Date - Jul 26 , 2025 | 04:17 AM

ద్యం కుంభకోణంలో జగన్‌రెడ్డి అండ్‌ కో రూ.వేల కోట్లు కొల్లగొట్టారని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆరోపించారు.

మద్యంలో కోట్లు కొల్లగొట్టారు: మంత్రి జనార్దన్‌

మాచర్ల టౌన్‌, జూలై 25(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో జగన్‌రెడ్డి అండ్‌ కో రూ.వేల కోట్లు కొల్లగొట్టారని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మాచర్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనల్లో పాల్గొన్న ఆయన... వెల్దుర్తిలో మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబుని అక్రమ కేసుల్లో జైల్లో ఉంచినప్పుడు లేవని నోళ్లు... మద్యం కుంభకోణంలో అడ్డంగా దొరికిన మిథున్‌రెడ్డి జైలుకు పోతే ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నాయి? కూటమి సుపరిపాలనలో సూపర్‌సిక్స్‌ పథకాలన్నీ అమలు జరుగుతుంటే వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారు’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

For More Andhrapradesh News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 04:18 AM