Minister Gottipati Ravi kumar: సత్వరమే రిలయన్స్ సీబీజీ ప్లాంట్లు
ABN , Publish Date - Jul 25 , 2025 | 05:38 AM
రిలయన్స్ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయో గ్యాస్(సీబీజీ) ప్లాంట్లను సత్వరమే ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని విద్యుత్తు సంస్థల అధికారులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు.
మౌలిక వసతుల ఏర్పాటులో సహకరించండి
ఇంధన సంస్థలను ఆదేశించిన మంత్రి గొట్టిపాటి
అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): రిలయన్స్ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయో గ్యాస్(సీబీజీ) ప్లాంట్లను సత్వరమే ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని విద్యుత్తు సంస్థల అధికారులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు.వెలగపూడి సచివాలయంలో గురువారం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌తో కలసి రిలయన్స్ సీబీజీ ప్లాంట్ల ఏర్పాటు పురోగతిపై మంత్రి సమీక్షించారు.సీబీజీ ప్లాంట్లను సత్వరమే పూర్తి చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రిలయన్స్‌కు సంపూర్ణ సహకారం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంపట్ల రిలయన్స్ సంస్థల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
YS Sharmila: మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి
Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..
Read latest AP News And Telugu News