Share News

దద్దనాల ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి బీసీ

ABN , Publish Date - Feb 26 , 2025 | 11:44 PM

మండలంలోని దద్దనాల ప్రాజెక్టును రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దనరెడ్డి తిరిగి ప్రారంభించారు. బుధవారం రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దనరెడ్డి, బీసీ ఇందిరమ్మ మోటార్లు అన చేసి ఎస్సార్బీసీ నీటిని జుర్రేరు ఎత్తిపోతల పథకం ద్వారా దద్దనాల ప్రాజెక్టుకు నీరు విడుదల చేసి పడమటి పల్లెలకు అంకితం చేశారు.

దద్దనాల ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి బీసీ
నీటి పంపింగ్‌ మోటార్లను ప్రారంభిస్తున్న మంత్రి బీసీ జనార్దనరెడ్డి, బీసీ ఇందిరమ్మ

బనగానపల్లె , ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి) : మండలంలోని దద్దనాల ప్రాజెక్టును రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దనరెడ్డి తిరిగి ప్రారంభించారు. బుధవారం రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దనరెడ్డి, బీసీ ఇందిరమ్మ మోటార్లు అన చేసి ఎస్సార్బీసీ నీటిని జుర్రేరు ఎత్తిపోతల పథకం ద్వారా దద్దనాల ప్రాజెక్టుకు నీరు విడుదల చేసి పడమటి పల్లెలకు అంకితం చేశారు. ప్రభుత్వం వద్ద నిధుల కొరత ఉండడంతో మంత్రి బీసీ సొంత డబ్బు 25.75లక్షలు వెచ్చించి గత వైసీపీ ప్రభుత్వంలో తుప్పుపట్టిపోయి, పాడై పోయి మూలన పడ్డ నాలుగు మోటార్లకు మరమ్మతులు చేయించారు. ఎస్సార్బీసీ కాల్వ ద్వారా ఏర్పాటు చేసిన జుర్రేరు ఎత్తిపోతల పథకం నుంచి దద్దనాల ప్రాజెక్టుకు నాలుగు మోటార్లు ఆన చేసి నీరు విడుదల చేసి ఎన్నికల్లో ఇచ్చిన మాటను మంత్రి నిలబెట్టుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దనరెడ్డి జుర్రేరు ఎత్తిపోతల పంప్‌హౌస్‌ వద్ద విలేఖర్లతో మాట్లాడుతూ సుమారు 28 గ్రామాలకు సాగు, తాగునీరు అందించాలనే ఉద్దేశంతో గతంలో టీడీపీ ప్రభుత్వహయంలో రూ.21 కోట్లతో జుర్రేరు ఎత్తిపోతల పథకాన్ని తాను ఎమ్మెల్యేగా పూర్తి చేయించా అని గుర్తు చేశారు. ఆ తర్వాత అఽధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లు జుర్రేరు ఎత్తిపోతల పథకాన్ని భ్రష్టు పట్టించిందన్నారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నిర్లక్ష్యం ఖరీదు అక్షరాలా రూ.25.75 లక్షలని అన్నారు. ఎస్సార్బీసీలో నీరు ఉన్నంతకాలం దద్దనాల ప్రాజెక్టుకు నాలుగు పంపుల ద్వారా నీరు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాతపాడు సర్పంచ మహేశ్వరరెడ్డి, మిట్టపల్లె సర్పంచ తులసిరెడ్డి, తిరుమలయ్య, బాలనాయుడు, భూషన్న, శంఖేశ్వరరెడ్డి, రంగస్వామి, సంగు శ్రీనివాసరెడ్డి, గాలి మధుసూదనరెడ్డి, ఐడీసీ ఏఈ నారాయణరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2025 | 11:44 PM