‘నల్లతామర’ నిర్మూలనకు తక్షణ చర్యలు: మంత్రి అచ్చెన్న
ABN , Publish Date - Dec 10 , 2025 | 05:03 AM
మిర్చి పంటలో నల్ల తామర పురుగు నిర్మూలనకు అత్యవసర చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉద్యాన శాఖను ఆదేశించారు.
అమరావతి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): మిర్చి పంటలో నల్ల తామర పురుగు నిర్మూలనకు అత్యవసర చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉద్యాన శాఖను ఆదేశించారు. మంగళవారం విజయవాడ క్యాంప్ ఆఫీస్ నుంచి ఉద్యాన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులుతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. ఉద్యాన శాస్త్రవేత్తలు తక్షణమే క్షేత్రస్థాయికి వెళ్లి, మిర్చిపై తెగుళ్లు, పురుగులను పరిశీలించి, నివారణ మార్గాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రస్తుత పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఉద్యాన శాఖ డైరెక్టర్, శాస్త్రవేత్తలను కోరారు.