Share News

మార్కెట్లు పడిపోవడానికి జగన్‌ ప్రచారాలే కారణం: అచ్చెన్న

ABN , Publish Date - Dec 02 , 2025 | 04:17 AM

రాష్ట్రంలో రైతు సంక్షేమం, వ్యవసాయ రంగంపై వైఎస్‌ జగన్‌ సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న వ్యాఖ్యలు ఆయన ఐదేళ్ల పాలనలో వ్యవసాయాన్ని ఎలా దెబ్బతీశారో...

మార్కెట్లు పడిపోవడానికి జగన్‌ ప్రచారాలే కారణం: అచ్చెన్న

అమరావతి, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతు సంక్షేమం, వ్యవసాయ రంగంపై వైఎస్‌ జగన్‌ సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న వ్యాఖ్యలు ఆయన ఐదేళ్ల పాలనలో వ్యవసాయాన్ని ఎలా దెబ్బతీశారో గుర్తు చేస్తున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘రైతుల కోసం ఒక్క ఉపశమన చర్య తీసుకోకుండా మార్కెట్‌ వ్యవస్థను దెబ్బతీసి, పంటలు పాడైనా.. కనీస మద్దతు ధర అందకుండా చేసి, రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని అట్టడుగు స్థాయికి తీసుకొచ్చింది గత ప్రభుత్వమే. ఉల్లి ధర తగ్గితే రూ.25 వేలు ఉన్న పరిహారాన్ని రూ.50 వేలకు పెంచి, రైతులకు రూ.104 కోట్లు ఇవ్వబోతున్నాం. గతంలో అరటి టన్ను రూ.25 వేలు ఉందంటున్న జగన్‌... అంత రేటు ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చారా? అతని గొప్ప వల్ల రేటు వచ్చిందనడం సిగ్గుచేటు. ఉచిత బీమా అని చెప్పి, జగన్‌లా మోసం చేయలేదు. మార్కెట్లు పడిపోవడానికి జగన్‌ తప్పుడు ప్రచారాలే కారణం’ అని అచ్చెన్న ఆరోపించారు.

Updated Date - Dec 02 , 2025 | 04:18 AM