Share News

Minister Achchennaidu: ఆప్కాబ్‌ సేవలు రాష్ట్రాభివృద్ధిలో కీలకం కావాలి

ABN , Publish Date - Aug 05 , 2025 | 06:05 AM

రాష్ర్టాభివృద్ధిఇలో ఆప్కాబ్‌ సేవలు కీలకం కావాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

Minister Achchennaidu: ఆప్కాబ్‌ సేవలు రాష్ట్రాభివృద్ధిలో కీలకం కావాలి

  • తక్కువ వడ్డీకి రుణాలివ్వాలి: మంత్రి అచ్చెన్నాయుడు

అమరావతి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ర్టాభివృద్ధిఇలో ఆప్కాబ్‌ సేవలు కీలకం కావాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం విజయవాడలో ఆప్కాబ్‌ 62వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అచ్చెన్న మాట్లాడారు. సహకార బ్యాంకుల సేవలు మరింత మెరుగుపడాలన్నారు. ఆప్కాబ్‌, డీసీసీబీలు, పీఏసీఎ్‌సల్లో పారదర్శకత, జవాబుదారీ తనం కోసం కంప్యూటరీకరణ చేస్తున్నామన్నారు. ప్రైవేట్‌ బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీకి రుణాలిచ్చేలా కృషి జరగాలని సూచించారు. ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2025 | 06:05 AM