Share News

కళాశాలల్లో మధ్యాహ్న భోజనానికి శ్రీకారం

ABN , Publish Date - Jan 04 , 2025 | 11:41 PM

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఇంటర్‌ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని కూటమి ప్రభుత్వం శనివారం ప్రారంభించింది.

కళాశాలల్లో మధ్యాహ్న భోజనానికి శ్రీకారం
మధ్యాహ్న భోజనం తింటున్నఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి

కొత్తచెరువు, జనవరి 4(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఇంటర్‌ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని కూటమి ప్రభుత్వం శనివారం ప్రారంభించింది. స్థానిక కళాశాలలో ఈ పథకాన్ని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రారంభించారు. కలెక్టర్‌ టీఎస్‌ చేతన మాట్లాడు తూ.. జిల్లాలోని 21 కళాశాలల్లో 6,220 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజ నాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. అన్నం పర బ్రహ్మ స్వరూపమని, దానిని వృథా చేయకుండా జాగ్రత్తగా విద్యార్థులు స్వీకరించాలని సూచిం చారు. అనంతరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి, కలెక్టర్‌ మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్ర మంలో డీఈఓ కిష్టప్ప, డీఐఈఓ రఘునాథరెడ్డి, ఎంఈఓ జయచంద్ర, తహసీల్దార్‌ నీలకంఠారెడ్డి, ఎంపీడీఓ నటరాజ్‌, కళాశాల ప్రిన్సిపల్‌ జ్యోతిర్లత, కళాశాల స్థల దాత పీవీ పార్వతమ్మ, విశ్రాంత ఉపాధ్యాయుడు వెంగన్న, విద్యార్థులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 11:41 PM