Share News

Maturi Ranganath: బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అమరావతి చైర్మన్‌గా రంగనాథ్‌

ABN , Publish Date - Jan 09 , 2025 | 03:47 AM

బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అమరావతి క్యాపిటల్‌ సెంటర్‌ చైర్మన్‌గా గుడివాడ అమ్మ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత మాటూరి రంగనాథ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.నాగమల్లేశ్వరరావు ప్రకటించారు.

Maturi Ranganath: బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అమరావతి చైర్మన్‌గా రంగనాథ్‌

విజయవాడ(ఆటోనగర్‌), జనవరి8 (ఆంధ్రజ్యోతి): బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అమరావతి క్యాపిటల్‌ సెంటర్‌ చైర్మన్‌గా గుడివాడ అమ్మ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత మాటూరి రంగనాథ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.నాగమల్లేశ్వరరావు ప్రకటించారు. బుధవారం విజయవాడలో నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం చేసింది. ప్రధాన కార్యదర్శిగా ఎస్‌.సత్యనారాయణ, కోశాధికారిగా కె.పి.కిరణ్‌, ఉపాఽధ్యక్షులుగా పట్నాయక్‌, రాజేష్‌, సంయుక్త కార్యదర్శిగా వి.వెంకట నారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రంగనాథ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ రంగ సమస్యల పట్ల సానుకూలంగా ఉండటం శుభ సూచకమన్నారు.

Updated Date - Jan 09 , 2025 | 03:47 AM