Share News

TDR Bonds: తిరుపతిలో కొల్లగొట్టారు..

ABN , Publish Date - Aug 29 , 2025 | 05:19 AM

తణుకు, కాకినాడ, గుంటూరు, తిరుపతిలో భారీగా టీడీఆర్‌ బాండ్ల కుంభకోణం జరిగినట్టు వైసీపీ హయాంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

TDR Bonds: తిరుపతిలో కొల్లగొట్టారు..

తణుకు, కాకినాడ, గుంటూరు, తిరుపతిలో భారీగా టీడీఆర్‌ బాండ్ల కుంభకోణం జరిగినట్టు వైసీపీ హయాంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నెల్లూరుకు చెందిన టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి గతంలో తిరుపతిలో ప్రెస్‌మీట్‌ పెట్టి టీడీఆర్‌ బాండ్ల స్కాంపై ఆరోపణలు చేశారు. రూ.4 వేల కోట్ల మేర కుంభకోణం అక్కడ జరిగిందని ఆయన విమర్శించారు. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో నిర్మించిన రోడ్లతో స్థలాలు కోల్పోయిన వారికి మొత్తం 1417 బాండ్లు జారీచేయాలని వైసీపీ నాడు నిర్ణయించింది.


అయితే, ఇందులో 380 బాండ్లకు అర్హత లేదని తాజాగా తేలింది. కానీ, అక్రమాలకు పాల్పడినవారిపై కూటమి ప్రభుత్వం పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవనే అభిప్రాయం వ్యక్తంఅవుతోంది. విజిలెన్స్‌ విచారణ కూడా తూతూ మంత్రంగా సాగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. తప్పుచేసిన అధికారులు, వైసీపీ నేతలపై చర్యలు తీసుకోకపోగా, అక్రమాలే జరగలేదన్న వ్యాఖ్యలపై సొంత పార్టీనేతలే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Aug 29 , 2025 | 05:19 AM