Share News

Marreddy Srinivasa Reddy: మామిడి రైతును దోచుకుంది వైసీపీ సిండికేటే

ABN , Publish Date - Jul 06 , 2025 | 04:24 AM

మామిడి రైతుల కష్టాలను వైసీపీ నాయకులు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారంటూ వైసీపీ రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైౖర్మన్‌ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Marreddy Srinivasa Reddy: మామిడి రైతును దోచుకుంది వైసీపీ సిండికేటే

  • మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి

అమరావతి, జూలై 5(ఆంధ్రజ్యోతి): మామిడి రైతుల కష్టాలను వైసీపీ నాయకులు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారంటూ వైసీపీ రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైౖర్మన్‌ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుంటే వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వైసీపీ నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం మామిడి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వైసీపీ నాయకులతో సత్సంబంధాలు కలిగిన పీఎల్‌ఆర్‌ ఫుడ్స్‌, సీజీఆర్‌ ఫుడ్స్‌, టాసా, సన్నిధి వంటి కంపెనీలు రైతుల నుంచి కిలో రూ.3కి మామిడిని కొనుగోలు చేస్తున్నాయి. ఇది ప్రభుత్వం నిర్దేశించిన ధర కన్నా తక్కువ. వైసీపీ నాయకులు సిండికేట్‌గా ఏర్పడి మామిడి రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు’ అని మర్రెడ్డి అన్నారు.

Updated Date - Jul 06 , 2025 | 04:26 AM