Tentu Sudhakar Funeral: ముగిసిన మావోయిస్టు సుధాకర్ అంత్యక్రియలు
ABN , Publish Date - Jun 10 , 2025 | 04:37 AM
మావోయిస్టు కీలకనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు సుధాకర్(65) అంత్యక్రియలు ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యవోలు గ్రామంలో సోమవారం ఉదయం ముగిశాయి. సుధాకర్ భౌతికకాయంపై ఎర్రజెండా కప్పి పలువురు నివాళులర్పించారు.
పెదపాడు, జూన్ 9(ఆంధ్రజ్యోతి) : మావోయిస్టు కీలకనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు సుధాకర్(65) అంత్యక్రియలు ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యవోలు గ్రామంలో సోమవారం ఉదయం ముగిశాయి. సుధాకర్ భౌతికకాయంపై ఎర్రజెండా కప్పి పలువురు నివాళులర్పించారు. సీపీఎం, సీపీఐ, ప్రజా సంఘాల నాయకులు, రచయితలు విప్లవ గీతాలను ఆలపించారు. సుధాకర్ భౌతికకాయాన్ని సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు తరలివచ్చారు. సుధాకర్ భౌతికకాయాన్ని ట్రాక్టర్‌పై ఉంచి శ్మశానవాటికకు తరలించగా, సుధాకర్ అన్న ఆనందరావు అంత్యక్రియలు నిర్వహించారు.