Share News

Nara Lokesh: దేశానికే రోల్‌ మోడల్‌గా జెమ్స్‌ అండ్‌ జ్యూయలరీ పార్కు

ABN , Publish Date - Jul 25 , 2025 | 03:58 AM

దేశంలోనే అత్యుత్తమ మోడల్‌ తరహాలో మంగళగిరి జెమ్స్‌ అండ్‌ జ్యూయలరీ పార్కు నిర్మాణం చేపట్టాలని మంత్రి లోకేశ్‌ సూచించారు.

Nara Lokesh: దేశానికే రోల్‌ మోడల్‌గా జెమ్స్‌ అండ్‌ జ్యూయలరీ పార్కు

  • అధికారులతో సమీక్షలో మంత్రి లోకేశ్‌

మంగళగిరి, జూలై 24(ఆంధ్రజ్యోతి): దేశంలోనే అత్యుత్తమ మోడల్‌ తరహాలో మంగళగిరి జెమ్స్‌ అండ్‌ జ్యూయలరీ పార్కు నిర్మాణం చేపట్టాలని మంత్రి లోకేశ్‌ సూచించారు. జెమ్స్‌ అండ్‌ జ్యూయలరీ పార్కు ఏర్పాటుపై గురువారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంగళగిరిలో ఏర్పాటు చేయబోతున్న జెమ్స్‌ అండ్‌ జ్యూయలరీ పార్కుతో పాటు కేంద్ర సహకారంతో కామన్‌ ఫెసిలిటీ సెంటరు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ఇందులో ఆభరణాల తయారీలో ప్రపంచస్థాయి శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. దేశంలో టాప్‌ 20 ఆభరణాల తయారీ సంస్థలు మంగళగిరి పార్కులో తయారీ యూనిట్లు, రిటైల్‌ షాపులు స్థాపించేలా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఇందుకోసం ఉడుపిలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ జెమ్స్‌ అండ్‌ జ్యూయలరీ(ఐఐజీజే) పనితీరును అధ్యయనం చేయాలని ఆదేశించారు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సీఈవో గణేష్‌ కుమార్‌ స్పందిస్తూ త్వరలో ఏర్పాటు చేసే కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ద్వారా ఏటా 4వేల మందికి అధునాతన ఆభరణాల తయారీలో శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. మంగళగిరిలో యువతకు నైపుణ్య శిక్షణ అందించేలా మోడల్‌ కెరీర్‌ సెంటర్‌ (ఎంసీసీ)ను కూడా త్వరితగతిన ఏర్పాటు చేయాలని లోకేశ్‌ ఆదేశించారు. మంగళగిరిలో ఇప్పటివరకు చేపట్టిన మూడు జాబ్‌ ఫెయిర్లకు 1,170 మంది హాజరు కాగా, 453 మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు తెలిపారు. దీనిపై లోకేశ్‌ స్పందిస్తూ ఇకపై ప్రతి నెలా జాబ్‌ ఫెయిర్‌ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, యువతకు నూరు శాతం ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో పనిచేయాలని ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

YS Sharmila: మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి

Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 04:02 AM