Share News

పనిచేయని నిఘానేత్రాలు

ABN , Publish Date - Jan 04 , 2025 | 11:43 PM

మండల కేం ద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు దాదాపు రెండే ళ్ల నుంచి పని చేయడం లేదు. గతంలో టీడీపీ టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఆ సీసీ కెమె రాలు చెడిపోయాయి.

పనిచేయని నిఘానేత్రాలు
బస్టాండ్‌ కూడలిలో నిరుపయోగంగా ఉన్న సీసీ కెమెరాలు

ముదిగుబ్బ, జనవరి 4(ఆంధ్రజ్యోతి): మండల కేం ద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు దాదాపు రెండే ళ్ల నుంచి పని చేయడం లేదు. గతంలో టీడీపీ టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఆ సీసీ కెమె రాలు చెడిపోయాయి. రెండెళ్ల నుంచి అవి పని చేయకున్నా... వైసీపీ పాలకులు వాటి మరమ్మతుల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన కనీసం అధికారుల్లో కూడా లేకుండాపోయిందని స్థానికులు వాపోయారు. సర్కిల్‌ల్లో రాత్రి సమయాల్లో దుకాణాలు, ఇళ్ల ముందు ఉంచిన కార్లు, ద్విచక్ర వాహనాలు చోరీలకు గురయ్యాయి. ప్రధానంగా బస్టాండ్‌ కూడలిలో ప్రయాణికులు బస్సులు ఎక్కే సమయంలో సెల్‌ఫోన్లు అధికంగా చోరీకి గురవుతు న్నాయి. గతంలో సీసీకెమెరాలు ఉండటంతో వాటి భయంలో చోరులు భయపడేవారు. అయితే ఇప్పుడు అవి పనిచేయకోవడంతో చోరులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. స్థానిక అంబేడ్కర్‌ కూడలిలో వార పు సంత జరుగుతుండటంతో తరచూ ప్రమాదా లు జరుగుతున్నాయి. గతంలో ఆ ప్రమాదాలకు కారకు లను గుర్తించేందుకు సీసీకెమెరాలు ఎంతో దోహ దపడేవి. సాయినగర్‌లో మూడు నెలల క్రితం ఇంటి ముందు పార్కింగ్‌ చేసిన కారు అపహరణకు గురైంది. అదేవిధంగా పట్ట పగలే దుకాణం ముందు పార్కింగ్‌ చేసిన పలు ద్విచక్రవాహనాలూ చోరీకి గురయ్యాయి. అప్పట్లో సీసీ పుటేజీల ద్వారా బైక్‌లు, సెల్‌ఫొన్లను పోలీసులు రికవరీ చేసి.. బాధితులకు అందజేసేవారు. కాని ప్రస్తుతం సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగలను గుర్తించడానికి వీలు లేకుండా పోయింది. గతంలో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడినా.. ఘర్షణలు జరుగుతున్నా.. స్టేషనలోని సీసీ కెమెరాల ద్వారా ఎస్‌ఐ విషయాన్ని తెలుసుకొని.. వెంటనే రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించేవారు. ప్రస్తుతం సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో ఎవరైనా పోలీసులకు సమచారం ఇస్తేనే వారు వస్తున్నారు. గత రెండేళ్లుగా సీసీ కెమెరాలు పనిచేయ కపోవడంతో శాంతిభద్రతలు, చోరీలు, ట్రాఫిక్‌ సమస్యలు అధికమయ్యా యని, ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి వాటికి మరమమ్మతులు చేయించి వినియోగంలోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Jan 04 , 2025 | 11:43 PM