Share News

బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయండి

ABN , Publish Date - Feb 15 , 2025 | 10:58 PM

అధికారులు, ఫెస్టివల్‌ కమిటీ సభ్యుల సమష్టి కృషితో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

   బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయండి
కాల్వబుగ్గలో మహాశివరాత్రి వాల్‌పోస్టర్లను విడుదల చేస్తున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

ఓర్వకల్లు, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): అధికారులు, ఫెస్టివల్‌ కమిటీ సభ్యుల సమష్టి కృషితో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కాల్వబుగ్గ రామేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకుముందు శివునికి ప్రత్యేక పూజలు చేశారు. మహాశివరాత్రి వాల్‌ పోస్టర్లను ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఫెస్టివల్‌ కమిటీ సభ్యులు, అధికారులు ఆవిష్కరించారు. అనంతరం సమీక్ష సమావేశంలో ఆయా శాఖ అధికారులు ఏర్పాట్లపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమీక్ష సమావేశంలో ఈవో మద్దిలేటి అధ్యక్షత వహించారు. ఈ నెల 25 నుంచి మార్చి 2వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు మల్లెల జ్యోతి, డీపీవో భాస్కర్‌, జనసేన నాయకులు సివిల్‌ సప్లయ్‌ డైరెక్టర్‌ మంజునాథ్‌, సుబ్బయ్య, ఎండోమెంటు అసిస్టెంట్‌ కమిషనర్‌ సుధాకర్‌ రెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్‌ సుధారాణి, తహసీల్దార్‌ విద్యాసాగర్‌, ఎంపీడీవో శ్రీనివాసులు, ఎస్‌ఐ సునీల్‌ కుమార్‌, ఈవోఆర్‌డీ సుబ్బరాయుడు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 10:58 PM