Madhav Says Jagan Will Go to Jail: ఎప్పటికైనా జగన్ జైలుకే..
ABN , Publish Date - Aug 14 , 2025 | 04:58 AM
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని జైలుకు పోనీయకుండా బీజేపీ అడ్డుకుంటుందన్న అసత్య ప్రచారాలు..
ఆయన్ను బీజేపీ కాపాడుతోందనడం అవాస్తవం: మాధవ్
నెల్లూరు, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని జైలుకు పోనీయకుండా బీజేపీ అడ్డుకుంటుందన్న అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. జగన్‌పై ఉన్న వివిధ కేసులు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నాయి. అయితే, ఎప్పటికైనా జగన్ జైలుకు వెళ్లక తప్పదు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం నెల్లూరుకు వచ్చిన మాధవ్.. తొలుత వేదాయపాళెం కూడలి వద్ద చాయ్ పే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆత్మకూరు బస్టాండ్ వద్ద పొట్టిశ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. వీఆర్సీ మైదానం నుంచి కస్తూరిబా కళాక్షేత్రం వరకు బీజేపీ శ్రేణులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. కస్తూరిబా కళాక్షేత్రంలో జరిగిన బీజేపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో మాధవ్ పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో రూ.9.75 లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో సెమీ కండక్టర్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారన్నారు. దేశంలో పనికిమాలిన, పనికారాని నాయకుడు రాహుల్ గాంధీ అని విమర్శించారు.