Share News

Lokesh to Visit TDP: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి లోకేశ్‌

ABN , Publish Date - Nov 04 , 2025 | 04:40 AM

రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు ఆయన పార్టీ కార్యాలయంలోనే ఉండనున్నారు.

 Lokesh to Visit TDP: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి లోకేశ్‌

  • క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకానున్న చిన్ని, కొలికిపూడి

అమరావతి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు ఆయన పార్టీ కార్యాలయంలోనే ఉండనున్నారు. ప్రజాదర్బార్‌ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే అర్జీలను ఆయన స్వీకరిస్తారు. అనంతరం కార్యకర్తలతో మాట్లాడతారు. మరోవైపు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ మంగళవారమే పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరుకానున్నారు. ఈ అంశంపైనా లోకేశ్‌ దృష్టి సారించే అవకాశం ఉంది. ప్రజాదర్బార్‌కు వచ్చే వారి కోసం కార్యాలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Nov 04 , 2025 | 05:11 AM