Share News

Nara Lokesh: 546 మందికి రూ.1,000 కోట్ల భూమి పట్టాలు

ABN , Publish Date - Apr 05 , 2025 | 02:15 AM

మంగళగిరిలో రూ.1,000 కోట్ల విలువైన భూములపై పేదలకు శాశ్వత హక్కులు కల్పిస్తూ నివేశన పట్టాలను పంపిణీ చేసిన మంత్రి లోకేశ్‌. 'మన ఇల్లు- మన లోకేశ్‌' కార్యక్రమంలో భాగంగా తొలి విడతగా 546 మందికి పట్టాలను స్వయంగా అందజేశారు.

Nara Lokesh: 546 మందికి రూ.1,000 కోట్ల భూమి పట్టాలు

ఘనంగా ఆరంభమైన ‘మన ఇల్లు - మన లోకేశ్‌’

తొలి విడతలో 3000 మందికి నివేశన స్థలాలు

13న 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన: మంత్రి లోకేశ్‌

మంగళగిరి, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.1,000 కోట్ల విలువైన ఆస్తులపై పేదలకు శాశ్వత హక్కును కల్పిస్తూ నివేశన పట్టాలను పంపిణీ చేస్తున్నామని మంత్రి లోకేశ్‌ అన్నారు. ‘మన ఇల్లు- మన లోకేశ్‌’ నినాదంతో పేదలకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని మంగళగిరి డాన్‌ బోస్కో ఉన్నత పాఠశాల వద్ద శుక్రవారం ఉదయం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలిరోజు షెడ్యూల్‌లో భాగంగా మొత్తం 546 మందికి నివేశన పట్టాలను లోకేశ్‌ తన స్వహస్తాలతో పంపిణీ చేశారు. వారందరికీ నూతన వస్త్రాలను అందజేసి లబ్ధిదారుల కుటుంబాలతో కలసి ఫొటోలను దిగారు. ప్రారంభ సభలో మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ... మంగళగిరిలో పోటీచేయాలని 2019లో తీసుకున్న నిర్ణయం, తదనంతర పరిణామాలు, 2024లో అత్యధిక మెజార్టీతో గెలుపొందడం వంటి విషయాలను భావోద్వేగంతో వివరించారు. మంగళగిరి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తానని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం తొలి విడతగా 3,000 మందికిపైగా పట్టాలను పంపిణీ చేయిస్తున్నా. దేవదాయ శాఖ, రైల్వే భూముల విషయంలో కొంత సమయం పట్టే అవకాశం వుంది. వాగు భూములు, అటవీ భూముల్లో నివశిస్తున్న వారికి పట్టాలను ఇప్పించడం చాలా కష్టమైన పని. అయినా నేను చేసి తీరుతా. అందుకు మూడేళ్లు పట్టవచ్చు. మొదటి విడత ఇస్తున్న పట్టాల విలువను బహిరంగ మార్కెట్‌తో పోల్చి చూస్తే రూ.1,000 కోట్ల వరకు వుంటుందని లోకేశ్‌ చెప్పారు. 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి 13న శంకుస్థాపన చేస్తామన్నారు. భూగర్భ డ్రైనేజి, గ్యాస్‌, పైప్‌ లైన్లు... చివరకు భూగర్భ విద్యుత్‌ లైన్ల పనులు కూడ మంగళగిరిలో వచ్చే రెండు నెలల్లో ప్రారంభిస్తామని లోకేశ్‌ వివరించారు.


ఇవి కూడా చదవండి

Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే

Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 05 , 2025 | 02:15 AM