Nara Lokesh: తల్లికి వందనంతో జగన్ కడుపుమంట పెరిగింది
ABN , Publish Date - Jun 16 , 2025 | 04:39 AM
తల్లికి వందనం పథకంతో లబ్ధి పొందిన తల్లుల కళ్లలో ఆనందం చూసి, జగన్ రెడ్డి కడుపు మంట మూడింతలు పెరిగిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఎద్దేవా చేశారు.
2 ఈనో ప్యాకెట్లు పంపుతా వాడండి: లోకేశ్
నీట్ విజేతలకు శుభాకాంక్షలు
చంద్రబాబుకు ఫాదర్స్‌డే శుభాకాంక్షలు
అమరావతి, జూన్ 15(ఆంధ్రజ్యోతి): తల్లికి వందనం పథకంతో లబ్ధి పొందిన తల్లుల కళ్లలో ఆనందం చూసి, జగన్ రెడ్డి కడుపు మంట మూడింతలు పెరిగిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఎద్దేవా చేశారు. జగన్ పత్రికలో ఈ పథకంపై తప్పుడు కథనాలు రాస్తూ వికృతానందం పొందుతున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. ‘ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులు, అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ కాలేదు. గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది క్షేత్ర పరిశీలన తర్వాత మాత్రమే వారికి నిధులు విడుదలవుతాయి. దొంగ లెక్కలు, డబ్బులు కొట్టేయడం మీ బ్రాండ్ జగన్. మీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలే అందరూ చేస్తారనుకుంటే ఎలా? మాది ప్రజాప్రభుత్వం. తప్పు చేయం.. చేయనివ్వం. జగన్ మీకు కడుపు మంటగా ఉన్నట్టుంది. రెండు ఈనో ప్యాకెట్లు పంపిస్తాను. వాడండి.. కాస్త తగ్గుద్ది’ అని పేర్కొన్నారు. కాగా, నీట్ విజేతలకు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘టాప్-100లో నిలిచిన రాష్ట్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులు.. డి.కార్తీక్ రామ్ కిరీటి, కె.మోహిత శ్రీరామ్, డి.సూర్యకిరణ్, పి.అవినాశ్, వై.సమీర్ కుమార్, టి.శివమణిదీ్‌పలకు హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. ఫాదర్స్‌డే సందర్భంగా చంద్రబాబుకు లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘నా ప్రేరణ.. నా గురువు.. నా మార్గదర్శి.. నా బాస్.. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.