Share News

Lokesh Assures Resolution Of Teachers: ప్రతి సమస్యకూ చర్చలతో పరిష్కారం

ABN , Publish Date - Aug 05 , 2025 | 05:51 AM

రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగాన్ని దేశంలోనే మోడల్‌గా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని మానవ వనరుల

Lokesh Assures Resolution Of Teachers: ప్రతి సమస్యకూ చర్చలతో పరిష్కారం

  • ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులతో లోకేశ్‌

అమరావతి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగాన్ని దేశంలోనే మోడల్‌గా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ ఆధ్వర్యంలో నోబుల్‌ టీచర్స్‌ సంఘ ప్రతినిధులు సోమవారం ఉండవల్లిలోని నివాసంలో మంత్రిని కలిశారు. ఎంఈవో పోస్టుల్లో జిల్లా పరిషత్‌ టీచర్లకు అవకాశం ఇవ్వాలని, 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్‌ అమలుచేయాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. టీచర్ల ప్రతి సమస్యకూ చర్చల ద్వారా పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. పాఠశాలల్లో జరిగే క్లస్టర్‌ సమావేశాలకు తాను కూడా హాజరవుతానని చెప్పారు. నోబుల్‌ టీచర్ల సంఘం అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు, ప్రధాన కార్యదర్శి హైమారావు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

Updated Date - Aug 05 , 2025 | 05:51 AM