వినండహో....!’
ABN , Publish Date - Sep 09 , 2025 | 11:08 PM
పెరిగిన సాంకేతిక విప్లవంలో దండోరా కాలగర్భంలో కలిసిపోయింది. దండోరా వేయడం అంతరించిపోవడంతో వాటిపై ఆధారపడ్డ కుటుం బాలు ప్రత్యామ్నాయ ఉపాధి వైపు మళ్లాయి.

గ్రామాల్లో సమాచార సాధనం తప్పెట
ఎక్కడా కన్పించని వైనం
సంప్రదాయాన్ని కబళించిన సాంకేతిక విప్లవం
ములకలచెరువు, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): ‘గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా రేపు మన ఊరు స్టోర్‌లో బియ్యం...చక్కెర కందిపప్పు, కిరసనాయిల్ ఇస్తారు. తెల్లకార్డు ఉన్న వారంతా వచ్చి సరుకులు తీసుకెళ్లాలని తహసీల్దారు చెబుతున్నారహో....!’
‘గ్రామ మహాజనులారా...! రేపు మనూరికి ఎమ్మార్వో, ఎండీఓ సార్లు వస్తున్నారు. సమస్యలు ఉంటే రేపు పొద్దున 11 గంటలకు పంచాయతీ ఆఫీసుకు వచ్చి అర్టీలు ఇచ్చుకోవాలి.’
‘పక్కనున్న అనంతపురం జిల్లా తనకల్లు మండ లంలో కలరా సోకిందహో. ప్రజలందరూ చేతులు బాగా కడుక్కుని అన్నం తినాలని, జాగ్రత్తగా ఉం డాలని ఎమ్మార్వో సారు తెలిపారహో..!’ అంటూ గతంలో పల్లెల్లో దండోరా (చాటింపు) వేసేవారు. రెండు దశాబ్దాల కిందట గ్రామంలో ఏ చిన్న ప్ర భుత్వ కార్యక్రమం చేయాలన్నా అందరికీ సమా చారం తెలియజేయాలంటే దండోరా వేయా ల్సిం దే. చివరికి బ్యాంకు తనఖా సొమ్ము వేలం విషయం సైతం దండోరా వేయించేవారు. కోర్టు పనులకు సైతం తప్పెటతో దండోరా వేయించారా అంటూ అడిగే వారు. నిత్యావసర సరుకులు వచ్చినా... పంపిణీ జరగాలన్నా... అంటువ్యాధులు ప్రబలినా... ప్రతి కూల పరిస్థితులు ఏర్పడినా... ఇంటి పన్ను, భూమి శిస్తు చెల్లించాలన్నా...
దండోరా కొడుతున్న శ్రీరాములు (ఫైల్ ఫొటో)
కరెం టు బిల్లుల చెల్లింపులు, హరికథలు... తోలుబొమ్మ లాటలు... సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతు న్నా దండోరా ద్వారానే సమాచారం చేర వేసేవా రు. చదువురాని వారికి సైతం సమాచారం అర్ధ మయ్యేది. పెరిగిన సాంకేతిక విప్లవంలో దండోరా కాలగర్భంలో కలిసిపోయింది. దండోరా వేయడం అంతరించిపోవడంతో వాటిపై ఆధారపడ్డ కుటుం బాలు ప్రత్యామ్నాయ ఉపాధి వైపు మళ్లాయి.
దండోరా శబ్దం విన్పిస్తే చాలు....
గ్రామాల్లో దండోరా శబ్ధం వస్తే చాలు ఎంతో ఆసక్తిగా వినేవారు. ఏమి చెబుతున్నాడోనని ఆసక్తిగా వినే వారు. ఇళ్లలో పిల్లలు అల్లరి చేసి నా, శబ్ధాలు చేసినా అరిచేవారు. మళ్లీ దండోరా వేసే వ్యక్తి వద్దకు వెళ్లి అడిగి తెలుసుకునేవారు.
సాంకేతిక విప్లవంతో....
సాంకేతిక విప్లవంతో ప్రస్తుతం గ్రామాల్లో జరిగే కార్యక్రమాల సమాచారం సెల్‌ఫోన్లకు వస్తోంది. పల్లెల్లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలు ఏవి జ రిగినా సెల్‌ఫోన్లకు సమాచారం వస్తుడడంతో నిమిషాల్లో తెలిసిపోతోంది. సెల్‌ఫోన్ల వినియోగం పెరగడంతో ఫోన్లకే సమాచారం అందిస్తున్నారు. పల్లెల్లో జరిగే కార్యాక్రమాలను ఒక రోజు ముందే సెల్‌ఫోన్లకు పంపుతున్నారు.