కల్లుగీత కార్మికులకు మద్యం షాపుల కేటాయింపు
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:58 AM
జిల్లా లో ప్రొహిబిషన్, ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో కల్లు గీత కార్మికుల్లోని ఉప కులాలకు కేటాయిం చిన 14 షాపులకు కలెక్టర్ వెట్రిసెల్వి శుక్ర వారం లాటరీ తీశారు. గౌడకు 2, గౌడ్‌కు 4, శెట్టిబలిజలకు 8 షాపులను ఆయా కులాల జనాభా ప్రాతిపదికన షాపులను కేటాయిం చాల్సి ఉండగా లాటరీ ద్వారా సామాజిక వర్గాలకు కేటాయింపును కలెక్టరేట్‌లో ఈ ప్రక్రియ చేపట్టారు.

లాటరీ ద్వారా ప్రకటించిన కలెక్టర్ వెట్రిసెల్వి
నేడు గెజిట్ నోటిఫికేషన్
ఏలూరు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా లో ప్రొహిబిషన్, ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో కల్లు గీత కార్మికుల్లోని ఉప కులాలకు కేటాయిం చిన 14 షాపులకు కలెక్టర్ వెట్రిసెల్వి శుక్ర వారం లాటరీ తీశారు. గౌడకు 2, గౌడ్‌కు 4, శెట్టిబలిజలకు 8 షాపులను ఆయా కులాల జనాభా ప్రాతిపదికన షాపులను కేటాయిం చాల్సి ఉండగా లాటరీ ద్వారా సామాజిక వర్గాలకు కేటాయింపును కలెక్టరేట్‌లో ఈ ప్రక్రియ చేపట్టారు. గౌడ్ సామాజిక వర్గానికి నూజీవీడు మునిసిపాలిటీ పరిధిలోని ఒక షాపు, చింతలపూడి రూరల్ ప్రాంతంలో ఒక షాపు, గౌడకు ఏలూరు కార్పొరేషన్, టి.నరసా పురం, దెందులూరు, జంగారెడ్డిగూడెం రూరల్ లో ఒక్కొక్కటి చొప్పున 4, శెట్టిబలిజకు జంగారెడ్డిగూడెం మునిసిపాలిటీ, చింతలపూడి, చాట్రాయి, ముసునూరు, మండవల్లి, నిడమ ర్రు, ఆగిరిపల్లి, కొయ్యలగూడెం మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున 8 షాపులను భర్తీ చేస్తారు. ఈ నెల 25న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 27 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తా రు. ఆన్‌లైన్, హైబ్రిడ్ విధానాలు ద్వారా రూ.2 లక్షల దరఖాస్తు రుసుం చెల్లించి దరఖాస్తును చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు ఫిబ్ర వరి 5 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 6న దరఖాస్తులను పరిశీ లన, ఏడున ఉదయం 10 గంటలకు లాటరీ పద్ధతిలో దరఖాస్తుల ఎంపిక ప్రక్రియను చేపడతారు. ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీలత , ఎక్సైజ్‌శాఖ సూపరింటెండెంట్ ఆనాల ఆవులయ్య, అసిస్టెంట్ సూపరింటెండెంట్ పాండురంగారావు, సీఐ జీఎస్ కృష్ణధనరాజ్, కల్లుగీత సామాజికవర్గంలోని ప్రతినిధులు పాల్గొన్నారు.