Share News

Shravan Rao: నా ఫ్లాట్‌కు వచ్చి వెళ్లే వారు

ABN , Publish Date - Jul 25 , 2025 | 02:53 AM

మద్యం కుంభకోణంలో కీలక నిందితులైన చాణక్య, వరుణ్‌ పురుషోత్తం దుబాయ్‌లో యాభై రోజుల పాటు ఉన్నట్లు తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక నిందితుడు శ్రవణ్‌ రావు వెల్లడించారు.

Shravan Rao: నా ఫ్లాట్‌కు వచ్చి వెళ్లే వారు

  • తెలుగు వాళ్లు అని రానిచ్చాను

  • వరుణ్‌, చాణక్య తెలుసు.. సిట్‌ విచారణలో శ్రవణ్‌ రావు

ద్యం కుంభకోణంలో కీలక నిందితులైన చాణక్య, వరుణ్‌ పురుషోత్తం దుబాయ్‌లో యాభై రోజుల పాటు ఉన్నట్లు తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక నిందితుడు శ్రవణ్‌ రావు వెల్లడించారు. ఏపీలో లిక్కర్‌ స్కామ్‌ దర్యాప్తు చేస్తున్న సిట్‌ నోటీసు ఇవ్వడంతో గురువారం ఆయన విజయవాడకు వచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం వరకూ సిట్‌ అధికారులు ఆయనను ప్రశ్నించి, వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. ‘తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ముందస్తు బెయిలు కోసం సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశాను. ఆ సమయంలో దుబాయ్‌లోని పారమౌంట్‌ రెసిడెన్సీలోని నా ఫ్లాట్‌లో ఉన్నా. ఒక కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా వరుణ్‌ పురుషోత్తం, చాణక్య నాకు పరిచయమయ్యారు. తరచూ నా ఫ్లాట్‌కు వచ్చి వెళుతుండేవారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో యాభై రోజుల పాటు ఉన్నారు. దుబాయ్‌లో వాళ్లు వేరే చోట ఎక్కడో ఉండేవారు. పూర్తిగా నా ఫ్లాట్‌లో ఉండే వారు కాదు. తెలుగు వాళ్లం కావడంతో అక్కడ ఏదో ఊసులు మాట్లాడుకునే వాళ్లం. అప్పటికి ఏపీ మద్యం కుంభకోణంలో ఈ ఇద్దరూ నిందితులు కాదు. నాకు వాళ్లతో ఎటువంటి ఆర్థిక లావాదేవీల్లేవు’ అని సిట్‌ అధికారులకు శ్రవణ్‌ రావు చెప్పినట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

YS Sharmila: మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి

Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 02:55 AM