Liquor Scam Accused Bail: లిక్కర్ నిందితుల బెయిల్ పిటిషన్ల విచారణ వాయిదా
ABN , Publish Date - Aug 05 , 2025 | 05:33 AM
మద్యం కుంభకోణం కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. ఎంపీ మిథున్‌రెడ్డి
నలుగురి పిటిషన్లపై కౌంటర్ దాఖలు
విజయవాడ, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో సోమవారం కౌంటర్ దాఖలు చేశారు. ధనుంజయ్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప, మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్లపై వాదనలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. కృష్ణమోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై వాదనలను న్యాయాధికారి పి.భాస్కరరావు బుధవారానికి వాయిదా వేశారు. మరో నిందితుడు సజ్జల శ్రీధర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ ఏడో తేదీకి వాయిదా పడింది.