Share News

Protest Black Badges: నేడు నల్లబ్యాడ్జీలతో వెలుగు సిబ్బంది నిరసన

ABN , Publish Date - Aug 14 , 2025 | 05:43 AM

అన్నమయ్య జిల్లా గుర్రంకొండ వెలుగు ఏపీఎం రజనీపై బుధవారం జరిగిన దాడిని ఖండిస్తూ ఏపీ స్టేట్‌ సెర్ఫ్‌ ఉద్యోగుల జేఏసీ ఒక..

Protest Black Badges: నేడు నల్లబ్యాడ్జీలతో వెలుగు సిబ్బంది నిరసన

అన్నమయ్య జిల్లా గుర్రంకొండ వెలుగు ఏపీఎం రజనీపై బుధవారం జరిగిన దాడిని ఖండిస్తూ ఏపీ స్టేట్‌ సెర్ఫ్‌ ఉద్యోగుల జేఏసీ ఒక ప్రకటనలో విడుదల చేసింది. వీఓఏలను తొలగించేవిషయంలో, కోర్టు కేసులు, రికవరీ విషయంలో తీవ్ర ఒత్తిడులు ఎదురవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు సిబ్బందిపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. అందుకు నిరసనగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా వెలుగుసిబ్బంది నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును వెలుగు రాష్ట్ర జేఏసీ నాయకులు కె. నాగరాజు, టి.ధనుంజయ్‌రెడ్డి, శోభన్‌బాబు ప్రకటనలో కోరారు.

Updated Date - Aug 14 , 2025 | 05:43 AM