సంక్రాంతి సంబరాలు చూసొద్దాం రండి
ABN , Publish Date - Jan 12 , 2025 | 11:01 PM
పల్లె సీమకు వెలుగు నింపే పండుగ వచ్చింది. గ్రామాలు సుఖశాంతులతో, ధన ధాన్యాలతో శోభిల్లాలని వైభవంగా సంక్రాంతి ఉత్సవాలు జరిపేందుకు ఏర్పాట్ల కోలాహలం మొదలైంది. జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా నాలుగు రోజులు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటేలా కామనూరు గ్రామంలో నిర్వహించనున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి స్వగ్రామం కామనూరులో ఆయన సోదరుడు మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి, గ్రామ పెద్దలు, కామనూరు ప్రజల ఆధ్వర్యంలో సంబరాలను నిర్వహిస్తున్నారు.

కామనూరులో అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు
ఆకట్టుకునేలా ఆటల పోటీలు
ఆకర్షణీయమైన బహుమతులు
ప్రొద్దుటూరు రూరల్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): పల్లె సీమకు వెలుగు నింపే పండుగ వచ్చింది. గ్రామాలు సుఖశాంతులతో, ధన ధాన్యాలతో శోభిల్లాలని వైభవంగా సంక్రాంతి ఉత్సవాలు జరిపేందుకు ఏర్పాట్ల కోలాహలం మొదలైంది. జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా నాలుగు రోజులు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటేలా కామనూరు గ్రామంలో నిర్వహించనున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి స్వగ్రామం కామనూరులో ఆయన సోదరుడు మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి, గ్రామ పెద్దలు, కామనూరు ప్రజల ఆధ్వర్యంలో సంబరాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు, పార్వేట మహోత్సవం, లక్ష్మీప్రసన్న వేణుగోపాలస్వామి, భీమలింగేశ్వరస్వామి గ్రామోత్సవాలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది ప్రజలు తరలి రానున్నారు. సంక్రాంతి సంబరాలకు తలమానికంగా నిలిచిన కామనూరు ఉత్సవాలు వైభవంగా జరిగేందుకు దే వాలయాలు, వాటి పరిసర ప్రాంతాలు, వివిధ రకాలపోటీలు నిర్వహించే మైదానంలో విద్యుత్తు లైట్లతో అలంకరించారు. పెద్ద పెద్ద స్తంభాలకు అధిక విద్యుత్తు కాంతులను వెదఝల్లే లైట్లను అమర్చి ఏర్పాట్లను తీర్చిదిద్దుతున్నారు. పోటీలకు అనుగుణంగా మైదానాన్ని చదును చేయడం, సభావేదిక, చలువ పందిర్ల ఏర్పాట్లు, తదితర పనులను ముమ్మరంగా చేపట్టారు.
భోగి సందర్భంగా
సోమవారం ఉదయం 15 ఏళ్లలోపు జూనియర్ కబడ్డీ పోటీలను (టీమ్‌కు ఏడుగురు సభ్యులు) నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో మొదటి మూడు బహుమతులు ఇస్తారు. ఉదయం 10 గంటలకు ట్రాక్టర్ అండ్ ట్రాలీ రివర్స్ పందెం నిర్వహించనున్నారు. రెండు బహుమతులు ఇస్తా రు. మధ్యాహ్నం రెండు గంటలకు స్లోబైక్ రైడ్ పోటీని నిర్వహిస్తారు. ఇందులో రెండు బహుమతులు ఇవ్వ నున్నారు. రాత్రి 7 గంటలకు అరుణ ఆర్కెస్ట్రా వారిచే రేలా రే రేలా సంగీత విభావరి ఏర్పాటు చేశారు. సంక్రాంతి రోజున ఉదయం 8 గంటలకు 15 ఏళ్లు పైబడిన సీనియర్ కబడ్డీ పోటీలు (టీంకు ఏడుగురు సభ్యులు) పోటీలు జరుగనున్నాయి. పోటీల్లో రెండు బహుమతులు ప్రకటించారు. మధ్యాహ్నం భోజన ఏర్పాట్లను చేయనున్నారు. కనుమ రోజు ఉదయం 5 గంటలకు ప్రసన్న వేణుగోపాలస్వామి, భీమలింగేశ్వరస్వామి దేవాలయాల్లో వివిధ రకాల పూజా కార్యక్రమాలు చేపట్టనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు పార్వేట మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్వేట కామనూరు నుంచి ప్రారంభమై రాధానగర్, గోపులాపురం, ఎర్రబల్లె, పెద్ద అగ్రహారం, బుక్కాయపలె ్ల, చిన్న అగ్రహారం, మాచనపల్లె మీదుగా 16వ తేదీ ఉదయం 6 గంటలకు గ్రామంలోని ప్రసన్న వేణుగోపాలస్వామి దేవస్థానం చేరుతుందన్నారు. అదే రోజు ఉదయం 6 గంటలకు రాయచోటికి చెందిన రవితేజ చెక్కభజన బృందంచే చెక్కభజన చేపట్టనున్నారు.
సుఖశాంతులతో శోభిల్లాలనీ....
ఇక్కడి స్వామివారి మూలవిరాట్టు నిర్మాణం చాలా విశేషమైంది. దశావతారాలు, గోపికలతో, పొన్నచెట్టు, గోవులతో, చతుర్భుజుడు శంఖుచక్రాలతో, వేణువుతో శ్రీకృష్ణ పరమాత్మ అత్యద్భుతంగా భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. కామనూరులో నిర్వహించే గ్రామోత్సవం, పార్వేట మహోత్సవాలను తిలకించేందుకు వేలాదిగా భక్తులు, ప్రజలు, కళాకారులు రానున్నారు.
యుద్ధానికి సై...
16వ తేదీ ఉదయం 9 గంటలలకు సీనియర్ కేటగిరి విభాగంలో బండలాగుడు పందేలు నిర్వహించనున్నారు. ఇందులో మొదటి బహుమతిగా రాయల్‌ఇన్‌ఫిల్డ్ 350 సీసీ (బుల్లెట్) మొదటి బహుమతి, రెండో బహుమతిగా టీవీఎస్ అపాచి 160 సీసీ, మూడో బహుతి టీవీఎస్ ఫోర్ట్ ద్విచక్ర వాహనం, 4వ బహుమతి టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100, 5వ బహుమతిగా రూ.25 వేలు నగదు, 6వ బహుమతిగా రూ.15 వేలు విజేతలకు అందజేయనున్నట్లు తెలిపారు. మిగిలిన వారికి కన్సొలేషన్ బహుమతిగా రూ.5,116 అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఈ ఎడ్ల పోటీలకు ఇప్పటికే సుమారు 18 నుంచి 20 జతల ఎద్దుల జతలు పోటీల్లో పాల్గొననున్నాయని తెలిపారు. ఎండ్ల పందేలకు పాల్గొనదలచినవారు పి.శివకాంత్‌రెడ్డి 6302087016, నంద్యాల శివనాగిరెడ్డి 6305785859, పెద్ది చంద్రశేఖర్‌రెడ్డి 8309294918, నంద్యాల వరప్రసాద్‌రెడ్డి 9989357009ను సంప్రదించాలని, నేరుగానైనా వచ్చి పేర్లు నమోదు చేసుకుని పోటీల్లో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.