Share News

తిరుమల నడక దారిలో చిరుత కలకలం

ABN , Publish Date - Feb 14 , 2025 | 06:51 AM

అలిపిరి నడకమార్గంలో గురువారం రాత్రి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఏడవమైలు ముగ్గుబావికి వద్ద భక్తులకు చిరుత కనిపించింది. దీంతో భయంతో ఓ భక్తబృందం కేకలు వేస్తూ పరుగులు తీశారు. వెంటనే సమీపంలో భద్రతాసిబ్బంది

తిరుమల నడక దారిలో చిరుత కలకలం

తిరుమల, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): అలిపిరి నడకమార్గంలో గురువారం రాత్రి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఏడవమైలు ముగ్గుబావికి వద్ద భక్తులకు చిరుత కనిపించింది. దీంతో భయంతో ఓ భక్తబృందం కేకలు వేస్తూ పరుగులు తీశారు. వెంటనే సమీపంలో భద్రతాసిబ్బంది సమాచారం ఇవ్వడంతో విజిలెన్స్‌, ఫారెస్ట్‌ అధికారులు అక్కడకి చేరుకున్నారు. క్షణాల వ్యవధిలో చిరుత అడవిలోకి వెళ్లిపోయినట్టు నిర్థారించుకున్న అటవీ అధికారులు కాలినడక భక్తులను అప్రమత్తం చేసి పంపారు.

Updated Date - Feb 14 , 2025 | 06:51 AM