Palla Srinivas Rao: సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి
ABN , Publish Date - Aug 16 , 2025 | 03:57 AM
నాయకులకు డబ్బు పట్ల కాకుండా సమాజం పట్ల బాధ్యత ఉండాలని, ఎన్టీఆర్, చంద్రబాబు అలాంటి నాయకులని ..
అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): నాయకులకు డబ్బు పట్ల కాకుండా సమాజం పట్ల బాధ్యత ఉండాలని, ఎన్టీఆర్, చంద్రబాబు అలాంటి నాయకులని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీనివాసరావు జెండా ఆవిష్కరించి, స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యాలయ కార్యదర్శి అశోక్‌బాబు, నాదెండ్ల బ్రహ్మం, వల్లూరు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో భువనేశ్వరి జాతీయజెండాను ఆవిష్కరించి, సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేశారు.