Share News

Kodi Katti case: జగన్‌ను కోర్టుకు రప్పిస్తా

ABN , Publish Date - May 21 , 2025 | 04:06 AM

విశాఖనివాసి న్యాయవాది అబ్దుల్ సలీం మాజీ సీఎం జగన్‌ను కోడి కత్తి, గులకరాయి కేసులలో కోర్టుకు హాజరు కావాలని తీవ్రంగా కోరుతున్నారు. జగన్‌ ఇప్పటి వరకు విచారణలో వాంగ్మూలం ఇవ్వకపోవడంతో కేసులు వేగంగా పరిష్కరించాలని ఆయన హెచ్చరించారు.

Kodi Katti case: జగన్‌ను కోర్టుకు రప్పిస్తా

అప్పటి వరకు నిద్రపోను.. న్యాయవాది అబ్దుల్‌ సలీం

రాయదుర్గం, మే 20(ఆంధ్రజ్యోతి): కోడి కత్తి, గులకరాయి కేసులలో మాజీ సీఎం జగన్‌ను కోర్టుకు రప్పించి తీరుతానని విశాఖపట్నానికి చెందిన న్యాయవాది అబ్దుల్‌ సలీం అన్నారు. అప్పటి వరకు నిద్రపోనని వ్యాఖ్యానించారు. క్రైమ్‌ నంబర్‌ 122/24గా నమోదైన అనిష్‌ కుమార్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బెంగాల్‌ బాండ్ల కేసు విషయమై మంగళవారం ఆయన అనంతపురం జిల్లా రాయదుర్గం కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కోడి కత్తి కేసులో హాజరు కావాలని 2023, ఏప్రిల్‌ 10న జగన్‌ను కోర్టు ఆదేశించిందని తెలిపారు. అయితే, ఆ కేసులో చంద్రబాబు, హర్షవర్ధన్‌ చౌదరిని తప్పించి, శీను అనే వ్యక్తిని మాత్రమే విచారించారని జగన్‌ పిటిషన్‌ దాఖలు చేశారని తెలిపారు. ఆ పిటిషన్‌ను ఎన్‌ఐఏ కోర్టు కొట్టివేసిందని, దాన్ని సవాల్‌ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. జగన్‌ వేసిన పిటిషన్‌ కొట్టివేస్తే తప్ప కోడి కత్తి కేసు విచారణ ప్రారంభం కాదన్నారు. మాజీ సీఎం జగన్‌ కోర్టు విధివిఽధానాలను పాటించడం లేదని విమర్శించారు. కోడి కత్తి, గులకరాయి కేసులలో ఆయన ఇప్పటివరకు వాంగ్మూలం ఇవ్వలేదని తెలిపారు. జగన్‌ కోర్టుకు హాజరై సాక్ష్యం చెబితేనే వాస్తవాలు వెలుగు చూస్తాయని చెప్పారు. నేరం చేసినవారికి శిక్ష తప్పదని, నేరాలకు పాల్పడిన జార్ఖండ్‌ మాజీ సీఎం మధుకోడా జైల్లో ఉన్నారని, ఇదే విషయం జగన్‌ కేసుల్లోనూ రుజువు కాబోతోందని సలీం వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్

Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

Read Latest AP News And Telugu News


Updated Date - May 21 , 2025 | 04:06 AM