Share News

AP Land Acquisition: ప్రధాన ప్రాజెక్టుల కోసం భూసేకరణ

ABN , Publish Date - May 20 , 2025 | 06:20 AM

ఆంధ్రప్రదేశ్‌లో కీలక సాగునీటి ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేపట్టేందుకు జల వనరుల శాఖ అనుమతించింది. డిప్యూటీ కలెక్టర్లకు దీనిపై ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.

AP Land Acquisition: ప్రధాన ప్రాజెక్టుల కోసం భూసేకరణ

  • డిప్యూటీ కలెక్టర్లకు జల వనరుల శాఖ ఆదేశం

అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టుల భూసేకరణకు జల వనరుల శాఖ ఆమోదం తెలిపింది. భూసేకరణ చేపట్టాలని ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లకు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ సోమవారం ఉత్తర్వులిచ్చారు. ఈ ప్రాజెక్టుల జాబితాలో పోలవరం కుడి కాలువ యూనిట్‌-1, 2, పోలవరం ఎడమ కాలువ యూనిట్‌-1, పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు (చింతూరు), పులిచింతల, వెలిగొండ, శ్రీశైలం, తెలుగుగంగ, వంశధార, తోటపల్లి బ్యారేజీ, హంద్రీ-నీవా యూనిట్‌-2, 1, గాలేరు-నగరి యూనిట్‌-1, సోమశిల, పెన్నహోబిలం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ మొదలైనవి ఉన్నాయి.

Updated Date - May 20 , 2025 | 06:22 AM