Share News

రిజిసే్ట్రషన్ల లాలూ‘ఛీ’

ABN , Publish Date - Jan 07 , 2025 | 11:55 PM

ఆదోని పట్టణానికి చెందిన ఎగ్గటి ఈశ్వరప్పకు శిల్పా సౌభాగ్య నగర్‌ పక్కనే సర్వే నంబరు 321-ఏలో 6.51 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.

   రిజిసే్ట్రషన్ల లాలూ‘ఛీ’

పైసలిస్తే ఎవరి భూమైనా రిజిసే్ట్రషన

అక్రమ రిజిసే్ట్రషన్లకు అడ్డాగా సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాలు

దళారుల దందా.. ఒక్కో డాక్యుమెంట్‌కు ఒక్కో రేటు

రిజిసే్ట్రషన విలువపై ఒక శాతం మాముళ్లు ఇవ్వాల్సిందే

తాజాగా ఆదోని, నంద్యాల సబ్‌ రిజిసా్ట్రర్లపై వేటు

కర్నూలు, జనవరి 7 (ఆంధ్రజ్యోతి):

ఆదోని పట్టణానికి చెందిన ఎగ్గటి ఈశ్వరప్పకు శిల్పా సౌభాగ్య నగర్‌ పక్కనే సర్వే నంబరు 321-ఏలో 6.51 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రియల్‌ ఎస్టేట్‌ రంగం విస్తరించడంతో ఇక్కడ ఎకరా రూ.5 కోట్లు చొప్పున రూ.35 కోట్టు పైమాటే. ఆ భూమిపై కన్నేసిన గోనేగండ్ల మండలం పెద్దమరివీడుకు చెందిన సి.ఈరన్న, నంద్యాలకు చెందిన ఆముదాల భాస్కర్‌లు భూమిపై కన్నేశారు. నకిలీ డెత సర్టిఫికెట్‌ సహా భూమిపై సర్వహక్కులు ఉన్నట్లు బోగస్‌ డాక్యుమెంట్లు సృష్టించారు. అవి ఒరిజినలా..? బోగస్‌ సర్టిఫికెట్లా.? పరిశీలించకుండానే రిజిసే్ట్రషన చేశారు. పక్కా సమాచారంతో బాధితులు పోలీస్‌ స్టేషనలో ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.

ఫ ఆదోని పట్టణం మండిగిరి రెవెన్యూ గ్రామం సర్వే నంబరు 379/బి, 380ఏ పరిధిలో ఎస్కేడి కాలనీ ఎల్‌పీ నంబరు 3/83లో 300 చదరపు గజాల (6 సెంట్లు స్థలం) కురువ హనుమంతమ్మ పేరిట ఉంది. 1984 నవంబరు 18న కొనుగోలు చేశారు. ఈ స్థలం పక్కనే నివాసం ఉంటున్న డెంటిస్ట్‌ డాక్టర్‌ రవికిరణ్‌ స్వయాన తల్లి జె.లక్ష్మి ఫొటోతో కురువ హనుమంతమ్మ పేరిట నకిలీ ఆధార్‌ కార్డు సృష్టించి సమీప బంధువు చిప్పల సురేశబాబు పేరిట గత అక్టోబరు 16న ఆదోని సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయంలో అక్రమ రిజిసే్ట్రషన చేశారు. బాధితుడు ఎంకే హరీశబాబు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భాగోతం వెలుగు చూసింది.

ఆదోని సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయం సబ్‌ రిజిసా్ట్రర్‌ హాజీమియా, సిబ్బంది కలసి రెండున్నర నెలల వ్యవధిలో రెండు అక్రమ రిజిసే్ట్రషన్లు చేశారు. ఈ భాగోతం వెనుక భారీ ఎత్తున నగదు చేతులు మారిందనే ఆరోపణులు ఉన్నాయి. అక్టోబరు 16న నకిలీ ఆధార్‌ కార్డు ఆధారంగా అక్రమ రిజిసే్ట్రషన చేశారని జిల్లా స్టాంప్స్‌ అండ్‌ రిజిసే్ట్రషన అధికారులు గుర్తించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా మరో అక్రమ రిజిసే్ట్రషన వెలుగులోకి వచ్చింది. సబ్‌ రిజిసా్ట్రర్‌ హజీమియాపై సస్పెన్షన వేటు పడింది. సబ్‌ రిజిసా్ట్రర్‌ ఆఫీస్‌ సిబ్బంది, డాక్యుమెంట్‌ రైటర్‌ సహా ఐదుగురు అరెస్టయి ఊచలు లెక్కించాల్సి వచ్చింది. ఆ రోజే చర్యలు తీసుకొని ఉంటే.. ఈ రోజు రూ.35 కోట్లకు పైగా విలువైన భూమి అక్రమ రిజిసే్ట్రషన జరిగి ఉండేది కాదుకదా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆదోనిలో ఒక్కటే కాదు.. నంద్యాల సబ్‌ రిజిసా్ట్రర్‌ నాయబ్‌ అబ్దుల్‌సత్తార్‌ ఎలాంటి విచారణ చేయకుండా కడప జిల్లా ప్రొద్దుటూరులో కోర్టు స్టేలో ఉన్న ఆస్తిని ఎనీవేర్‌ రిజిసే్ట్రషన కింద రిజిసే్ట్రషన చేశారు. సస్పెన్షన వేటుకు గురయ్యారు. వెలుగు చూసిన సంఘటనలు ఇవి. వెలుగులోకి రానివి ఎన్ని ఉన్నాయో..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాదు సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాయాలు దోపిడీ కేంద్రాలుగా మారాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఒక్కో రిజిసే్ట్రషనకు ఒక్కో రేటు చొప్పున.. ‘లోపలి ఫీజు.. బయటి ఫీజు’ పేరుతో దందా సాగిస్తున్నారు.

కర్నూలు జిల్లాలో 11, నంద్యాల జిల్లాలో 13 సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాలు ఉన్నాయి. స్థిరాస్తులు క్రయ విక్రయాలు, దాన సెటిల్మెంట్లు (గిప్ట్‌ డీడ్‌), వీలునామా.. వంటి డాక్యూమెంట్ల రిజిసే్ట్రషన కోసం ప్రజలు వస్తుంటారు. రోజుకు సరాసరి 850 నుంచి వెయ్యికి పైగా వివిధ డాక్యుమెంట్లు రిజిసే్ట్రషన జరుగుతున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. ముప్పాతిక శాతం భూములు, ప్లాట్లు, భవనాలు వంటి స్థిరాస్తుల రిజిసే్ట్రషన్లే ఉంటాయి. 20 ఏళ్ల క్రితం ప్రతి సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయం పరిధిలో లైసెన్సుడ్‌ స్టాంప్‌ రైటర్లు ఉండేవారు. వారి పెత్తనం పెరగడం, అవినీతికి డాక్యుమెంట్‌ రైటర్లు కేంద్ర బిందువుగా మారడంతో 2002 మేలో అప్పటి ప్రభుత్వం డాక్యుమెంట్‌ రైటర్ల వ్యవస్థను రద్దు చేసింది. రికార్డుల్లో రద్దు జరిగినా.. సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాల్లో వారి పెత్తనానికి అడ్డుకట్ట పడలేదు. వారు లేనిదే ఒక్క డాక్యుమెంట్‌ కూడా రిజిసే్ట్రషన జరగడం లేదనేది అక్షర సత్యం. అదే క్రమంలో అక్రమార్కులు, డాక్యుమెంట్‌ రైటర్లు, సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయం సిబ్బంది చేతులు కలిపి అక్రమ రిజిసే్ట్రషన్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఫ మారని తీరు..!

ఆదోనిలో బహిరంగ మార్కెట్‌లో దాదాపు రూ.35 కోట్లకు పైగా విలువైన 6.51 ఎకరాలు నకిలీ సర్టిఫికెట్లతో అక్రమ రిజిసే్ట్రషన చేసిన సబ్‌ రిజిసా్ట్రర్‌ హాజీమియా గతంలోనూ ఇలాంటి వివాదాల్లోనే చిక్కుకున్నాడు. గతంలో కర్నూలు, కల్లూరు సబ్‌ రిజిసా్ట్రర్‌గా పని చేసిన సమయంలో నిషేదిత జాబితాలో ఉన్న వక్ఫ్‌ బోర్డు స్థలాలను రిజిసే్ట్రషన చేశారనే ఆరోపణులు ఉన్నాయి. చనిపోయిన ఓ వ్యక్తిని బతికే ఉన్నట్లు కొందరు తప్పుడు పత్రాలు, నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి అక్రమ రిజిసే్ట్రషన చేశారు. ఈ బాగోతంలో హాజీమియా పాత్ర కూడా ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో.. ఆ అక్రమ రిజిసే్ట్రషనను రద్దు చేసినట్లు తెలుస్తుంది. సెప్టెంబరులో జరిగిన బదిలీల్లో డోన రిజిసా్ట్రర్‌ కార్యాలయం సబ్‌ రిజిసా్ట్రర్‌గా బదిలీపై వెళ్లాడు. అక్కడి నుంచి ఆదోని సబ్‌ రిజిసా్ట్రర్‌గా ఇనచార్జిగా వెళ్లారు. నెల రోజులు గడవకనే దాదాపు రూ.1.75 కోట్లు విలువైన ఎస్కేడీ కాలనీలోని 6 సెంట్ల స్థలం అక్రమ రిజిసే్ట్రషన చేశారు. ఈ ఘటన మరవకనే.. ఏకంగా 6.51 ఎకరాల భూమిని బతికి ఉన్న వ్యక్తి చనిపోయినట్లు నకిలీ డెత సర్టిఫికెట్‌, బోగస్‌ డాక్యుమెంట్లు తీసుకొస్తే అక్రమంగా రిజిసే్ట్రషన చేయడం వెనుక ఆంతర్యమేమిటీ..? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. విజిలెన్స అండ్‌ ఎనఫోర్స్‌మెంట్‌ అధికారులు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో గతేడాది కాలంలో జరిగిన రిజిసే్ట్రషన్లను క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలిస్తే ఇలాంటి అక్రమ రిజిసే్ట్రషన్లతో పాటు అక్రమ వసుళ్ల బాగోతం వెలుగు చూస్తుందని పలువురు పేర్కొంటున్నారు.

ఫ ఒక్కో డాక్యుమెంట్‌కు ఒక్కో రేటు

కర్నూలు జిల్లాలో 11 సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాలు ఉన్నా.. కర్నూలు, కల్లూరు, ఆదోని, ఎమ్మిగనూరు, అలూరు, కోడుమూరు, పత్తికొండ వంటి సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాల్లో.. నంద్యాల జిల్లాలో 13 సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాలు ఉంటే.. నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరు, డోన, బనగానపల్లె రిజిసా్ట్రర్‌ కార్యాలయాల్లో మెజార్టీగా డాక్యుమెంట్లు రిజిసే్ట్రషన్లు జరుగుతున్నాయి. ప్రతి సబ్‌ రిజిసా్ట్రర్‌ ఆఫీసు పరిసరాల్లో 15-35 మందికి పైగా డాక్యుమెంట్‌ రైటర్లు ఉన్నారు. దసా్త్రలు రిజిసే్ట్రషన చేయిస్తే స్టాంపుడ్యూటీ, రిజిసే్ట్రషన ఫీజు కాదని.. అనధికారిక వసూళ్లకు తెరతీశారు. ఒక్కో డాక్యుమెంట్‌కు ఒక్కో రేటు చొప్పున వసులు చేస్తున్నారు. మెజార్టీ సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాల పరిధిలో రిజిసే్ట్రషన విలువపై 7.5 శాతం స్టాంప్‌ డ్యూటీతో పాటు ఒక శాతం మాముళ్ల అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అదే వివాదాల్లో ఉన్న ఆస్తులను రిజిసే్ట్రషన చేయడానికి రూ.లక్షల్లో డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రతి డాక్యుమెంట్‌ రిజిసే్ట్రషనకు రూ.2-5 వేలు వసులు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. దసా్త్రల్లో లోపాలు ఉంటే రూ.వేలు, లక్షల్లో వసులు చేస్తున్నారు.

ఫ కళ్లకు గంతలు కట్టుకున్నారా..?

ఆయా సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాల్లో జరిగే రిజిసే్ట్రషన్లలో అక్రమాలు జరకుండా నివారించడంతో పాటు ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం పెంచడం, ప్రజలకు మెరుగైన, తక్షణ రిజిసే్ట్రషన సేవలు అందించే లక్ష్యంగా స్టాంప్స్‌ అండ్‌ రిజిసే్ట్రషన శాఖ డీఐజీ, డీఆర్‌ఓ, ఆడిటింగ్‌ విభాగం డీఆర్‌ఓలు నిత్యం పర్యవేక్షణ, తనిఖీలు చేయాల్సి ఉంది. ఆకస్మిక తనిఖీలు చేస్తూ పారదర్శక సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలి. అయితే తనిఖీలు చేయడం లేదని, అక్రమ వసుళ్లలో కింది స్థాయి నుంచి పైస్థాయి అధికారులు కొందరికి వాటాలు అందుతుండడంతో తనిఖీ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాల్లో జరుగుతున్న అక్రమ వసూళ్లకు, అక్రమ రిజిసే్ట్రషన్లకు కళ్లెం వేయాలని పలువురు కోరుతున్నారు. ఆదోని, నంద్యాలలో వెలుగు చూసిన అక్రమ రిజిసే్ట్రషన్లు, అక్రమ వసుళ్లపై స్టాంప్స్‌ అండ్‌ రిజిసే్ట్రషన శాఖ కర్నూలు డీఐజీ పీజీఎస్‌ కళ్యాణి, కర్నూలు డీఆర్‌ఓ చెన్నకేశవరెడ్డి వివరణ కోసం ఆంధ్రజ్యోతి ఫోన్లో ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు.

Updated Date - Jan 07 , 2025 | 11:55 PM