Share News

సమన్వయ లోపం.. విద్యార్థులకు శాపం

ABN , Publish Date - Feb 10 , 2025 | 11:44 PM

మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల వసతి గృహం, పాఠశాల అధికారులు, సిబ్బంది సమన్వయ లోపం విద్యార్థులకు శాపంగా మారింది.

సమన్వయ లోపం.. విద్యార్థులకు శాపం
వంట సిబ్బందితో మాట్లాడుతున్న త్రిసభ్య కమిటీ సభ్యులు

గడివేముల, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల వసతి గృహం, పాఠశాల అధికారులు, సిబ్బంది సమన్వయ లోపం విద్యార్థులకు శాపంగా మారింది. ఈనెల 2న కలుషిత ఆహారం తిని ఆదర్శ పాఠశాల వసతి గృహ విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటనపై తహసీల్దార్‌ వెంకటరమణ, ఎంపీడీవో వాసుదేవగుప్త, ఎంఈవో మేరిసునితల త్రిసభ్య కమిటీ సోమవారం విచారణ చేపట్టారు. వసతి గృహంలోని పరిసరాలను, వంటగదిని, మంచి నీళ్ల ట్యాంకును పరిశీలించారు. వసతి గృహ సిబ్బంది, వార్డెన, ప్రిన్సిపాల్‌ను ఫుడ్‌పాయిజన సంఘటనపై విచారించారు. ఈ విచారణలో అధికారులు, సిబ్బంది సమన్వయ లోపంతో విద్యార్థినులు ఇబ్బందులకు గురవుతున్నారని గుర్తించారు. ఈనెల 2న హాస్టల్‌కు నాసిరకమైన చికెన సరఫరా అయినా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదని, వంట సిబ్బంది ఆలస్యంగా వచ్చి ఉడికి ఉడకని చికెనను విద్యార్థినులకు పెట్టడంతో ఆ ఆహారాన్ని తిని అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులకు నిల్వ ఉన్న తాగునీటిని అందించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం రాయలసీమ విద్యార్థి ఫెడరేషన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవింద్రనాథ్‌, డీబీఎ్‌సఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు నాగన్న, ఏపీఎ్‌సఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్రలు ప్రిన్సిపాల్‌, వార్డెన సమన్వయ లోపం వల్ల విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని త్రిసభ్య కమిటీకి ఫిర్యాదు చేశారు. త్రిసభ్య కమిటీ సభ్యులు మాట్లాడుతూ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు.

Updated Date - Feb 10 , 2025 | 11:44 PM