జెడ్పీ హైస్కూల్ ఆకస్మిక తనిఖీ
ABN , Publish Date - Nov 21 , 2025 | 11:13 PM
: నంద్యాల పట్టణం నందమూరి నగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ శుక్ర వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మెనూలో గుడ్లు ఇవ్వకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం
హెడ్‌మాస్టర్‌కు, ఎంఈవోకు షోకాజ్ నోటీసులు
నంద్యాల రూరల్, నవంబరు21(ఆంఽధ్రజ్యోతి): నంద్యాల పట్టణం నందమూరి నగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ శుక్ర వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిసర ప్రాంతాలు, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండడంతో ప్రధానోపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. గత మూడు రోజులుగా మెనూలో గుడ్లు ఇవ్వలేదని విద్యార్థులు చెప్ప డంతో వంటశాలను పరిశీలించారు. అక్కడ పరిస్థితులు సరిగా లేకపో వడంతో హెడ్‌మాస్టర్‌కు, ఎంఈవోకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అక్కడ పరిస్థితులను చక్కదిద్దాలని డీఈవోను ఆదేశించారు.