నేడు కర్నూలుకు వైఎస్ షర్మిల
ABN , Publish Date - Sep 08 , 2025 | 01:14 AM
నేడు కర్నూలుకు వైఎస్ షర్మిల
కర్నూలు అర్బన్ , సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): ఉల్లి, టమోటా రైతులకు మద్దతు తెలిపేందుకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం కర్నూలుకు రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ సిటీ ప్రెసిడెంట్ షేక్ జిలానీబాషా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11గంటలకు పుల్లూరు టోల్ ప్లాజా వద్ద పార్టీ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలుకుతారని పేర్కొన్నారు. అక్కడి నుంచి కొత్త బస్టాండ్ సమీపంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు చేరుకుని రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటారని వివరించారు. అనంతరం ఉల్లి రైతులను పరామర్శించి పండించిన పంటలకు మద్దతు ధర ప్రకటించే వరకు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని రైతులు, నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.