Share News

మహిళలకు వైఎస్‌ భారతి క్షమాపణ చెప్పాలి

ABN , Publish Date - Jun 11 , 2025 | 12:34 AM

మహిళలను ఆవమానిస్తే ఊరుకునేది లేదని, వైఎస్‌ భారతి క్షమాపణ చెప్పాలని మహిళలు డిమాండ్‌ చేశారు.

మహిళలకు వైఎస్‌ భారతి క్షమాపణ చెప్పాలి
అమ్మ హాస్పిటల్‌ సెంటర్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి మహిళల ర్యాలీ

కల్లూరు, జూన 10(ఆంధ్రజ్యోతి): మహిళలను ఆవమానిస్తే ఊరుకునేది లేదని, వైఎస్‌ భారతి క్షమాపణ చెప్పాలని మహిళలు డిమాండ్‌ చేశారు. అమరావతి మహిళలను అత్యంత జుగుప్సాకరంగా దూషించిన జగన మీడియా ప్రతినిధులు కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీని వాసరావులపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం మాధవీ నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి అమ్మ హాస్పిటల్‌ సెంటర్‌ వరకు మహిళలు నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం సాక్షి పేపర్‌ ప్రతులను దహనం చేశారు. వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలను ఖండించకపోగా సంకర జాతి వారిగా చిత్రీక రించడం అవివేకానికి అజ్ఞానానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మహిళా నాయకులు శైలజా యాదవ్‌, మసుంధర, రాములమ్మ, పెరుగు పురుషోత్తంరెడ్డి, ప్రభాకర్‌ యాదవ్‌, బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, పల్లె రఘునాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2025 | 12:34 AM