Share News

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి : వీసీ

ABN , Publish Date - Jun 26 , 2025 | 11:34 PM

మాదకద్రవ్యాల వినియోగానికి యువత దూరం ఉండాలని ఆర్‌యూ ఉప కులపతి వి. వెంకట బసవరావు అన్నారు.

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి : వీసీ
మాట్లాడుతున్న ఉప కులపతి

కర్నూలు అర్బన్‌, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాల వినియోగానికి యువత దూరం ఉండాలని ఆర్‌యూ ఉప కులపతి వి. వెంకట బసవరావు అన్నారు. గురువారం రాయలసీమ యూనివర్సిటీలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల కారణంగా యువత నిర్వీర్యమౌతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రకరకాల ఆకర్షణలకు లోనై బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. వర్సిటీ క్యాంపస్‌లో డ్రగ్స్‌కు స్థానం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత వర్సిటీ వర్గాలపై ఉందన్నారు. కార్యక్రమంలో రెక్టార్‌ ఎన్‌టీకే నాయక్‌, రిజిస్ట్రార్‌ బోయ విజయకుమార్‌ నాయుడు, డీన్‌లు సుందరానందపుచ్చా, భరత్‌ కుమార్‌, ఆధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2025 | 11:34 PM