యువత ప్రతిభ చాటాలి
ABN , Publish Date - Oct 17 , 2025 | 10:59 PM
యువజన ఉత్సవాల్లో యువత ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చాటాలని కలెక్టర్ రాజకుమారి తెలిపారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : యువజన ఉత్సవాల్లో యువత ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చాటాలని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా యువజన సంక్షేమ శాఖ- సెట్కూరు ఆధ్వర్యంలో నిర్వహించ బడనున్న నంద్యాల జిల్లాస్థాయి యువజనోత్సవాల పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఈ ఉత్సవాలు అద్భుత వేదికగా నిలుస్తాయన్నారు. 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతీయువకులు పాల్గొనవచ్చని తెలిపారు. సెట్కూరు సీఈవో డా.వేణుగోపాల్ మాట్లాడుతూ ఈనెల 29న పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జిల్లాస్థాయి యువజనోత్సవ పోటీలు ఏడు విభాగాల్లో నిర్వహించబడుతాయన్నారు. జిల్లాస్థాయిలో మొదటి స్థానంలో నిలి చిన వారు రాష్ట్రస్థాయికి, రాష్ట్రస్థాయిలో గెలుపొందిన వారు జాతీయ స్థాయికి ఎంపికవుతారని తెలిపారు. విజేతలకు ప్రశంసాపత్రాలు, జ్ఞా పికలు పాల్గొన్న కళాకారులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజే స్తార న్నారు. ఆసక్తిఉన్న యువత వివరాలకు 9292207601, 8328181581 మొబైల్ నంబర్లను సంప్రదించొచ్చని సీఈవో తెలిపారు. డీఈవో జనార్దన్‌రెడ్డి, ఇంటర్మీడియట్ విద్యాధికారి శంకర్‌నాయక్, స్కిల్ డెవలప్ మెంట్ అధికారి శ్రీకాంత్‌రెడ్డి, రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బయ్య, సెట్కూరు పర్యవేక్షణాధికారి శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు.